కరోనా బాధితుల కోసం హోంఐసోలేషన్ కిట్స్..

205
home isolation kit
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ పరిధిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే టెస్టుల సంఖ్యను పెంచిన ప్రభుత్వం….తాజాగా కరోనా బారినపడి ఇంట్లోనే చికిత్స పొందుతున్న వారి కోసం హోంఐసోలేషన్ కిట్స్‌ని తీసుకొచ్చింది.

కరోనాను తగ్గించేందుకు అవసరమైన మందులు,ఇతర సామాగ్రితో ఉన్న కిట్లను ఉచితంగా అందిస్తోంది. తెలంగాణలో 10వేలకు పైగా కరోనా బాధితులు హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా వీరికి మరింత ధైర్యం కల్పించడంతో పాటు నిరంతర డాక్టర్ల పర్యవేక్షణ ఉండేలా చూస్తోంది.హోంఐసొలేషన్‌ లో ఎలా ఉండాలో సూచించే బ్రోచ ర్‌, కాల్‌ సెంటర్‌ నంబర్లు, వైద్యు లు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ల మొబై ల్‌ నంబర్లను పొందుపరిచారు.

ఐసొలేషన్‌ కిట్‌లో ఉండే వస్తువల వివరాలను చూస్తే…34 విటమిన్‌-సీ టాబ్లెట్స్‌ ఉన్నాయి. 17 జింక్ టాబ్లెట్స్‌,17 బీ- కాంప్లెక్స్‌ ,6 క్లాత్ మాస్కులు,1శానిటైజర్,1 హ్యాండ్ వాష్,2 గ్లోవ్స్ ఉన్నాయి.

- Advertisement -