విజయవాడలో ‘ఇస్మార్ట్ శంకర్’..

272
- Advertisement -

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్ శంకర్. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్‌ విజయవాడలో సందడి చేశారు. బందరు రోడ్ లోని గేట్ వే హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో రామ్‌తో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు పాల్గొని చిత్ర విశేషాలను వివరించారు.

hero ram

ఈ సందర్భంగా హీరో రామ్‌ మాట్లాడుతూ ‘విజయవాడ రావడం సంతోషంగా ఉందన్నారు. మా సినిమా ట్రైలర్, సాంగ్స్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.పూరీ జగన్నాధ్ పై ఉన్న నమ్మకం తోనే ఈ చిత్రంలో నటించినట్లు తెలియజేసారు. ఈచిత్రంలో ఇద్దరుహీరోయిన్స్ నటించారని వారిద్దరు కూడా పోటాపోటీ గా నటించారని తెలిపారు. ఈమధ్య కాలంలో ఇద్దరు హీరోయిన్స్ తో కలిసి నటిస్తున్న చిత్రాలు విజయవంతం అవుతున్నాయని అన్నారు. రామ్, పూరీల సినిమాగా మీడియానే మంచి ప్రచారం ఇస్తోందని చెప్పారు. జగడం తర్వాత నేను పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్ చేసిన సినిమా ఇదేనని తెలిపారు. సినిమాలో క్యారెక్టర్ విధానం‌ బట్టి భాష ఉంటుందని పేర్కొన్నారు.

ram in ap

అనంతరం హీరోయిన్స్ నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు మాట్లాడుతూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించడం తమ కెరీర్ కు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటింఛామని తెలిపారు. ఈచిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి తమను ఆశీర్వదించాలని కోరారు.

- Advertisement -