సెమీస్‌పోరులో భారత్‌ ఘోర పరాజయం..

135
India

ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా సెమీస్‌పోరులో చేతులెత్తేసింది.. టాప్‌ఆర్డర్‌ 5 పరుగులకే కుప్పకూలింది. ఆదుకున్నట్లే కనిపించిన పంత్‌(32), పాండ్య(32) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరుకున్నారు. అయినా ఆశల్లేని మ్యాచ్‌లో టీమిండియా గొప్ప పోరాటం చేసింది. జడేజా(77; 59బంతుల్లో 4×4, 4×6), ధోనీ(50; 70బంతుల్లో 1×4, 1×6) వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను దాదాపు గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ కీలక సమయంలో ఔట్‌ కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

దీంతో 18 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరుకుంది. భారత్‌ 49.3 ఓవర్లలో 221 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్‌ బౌలర్లలో హెన్రీ మూడు, బౌల్ట్‌, శాంట్నర్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ ఓటమితో భారత్‌ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. రేపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సెమీస్ విజేతతో జూలై 14న జరిగే టైటిల్ పోరులో తలపడనున్నారు.