పాత ఫోన్ అమ్మేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

31
- Advertisement -

నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉండడం సర్వసాధారణం. మొబైల్ ను కనీసం ఒకటి లేదా రెండు సంవత్సరాలు వాడుతుంటారు. ఆ తరువాత పాత మొబైల్ పక్కన పెట్టి కొత్త మొబైల్ కొనుకున్నెందుకు ఇష్టపడుతుంటారు. కొందరైతే మొబైల్ కొనుకున్న ఆర్నెళ్ళకే ఆ మొబైల్ అమ్మి మరో కొత్త మొబైల్ కొనుకుంటూ ఉంటారు. అయితే పాత మొబైల్ అమ్మేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. లేదంటే పర్సనల్ డేటా ఇతరుల చేతికి చిక్కే అవకాశం ఉంది. కాబట్టి పాత మొబైల్ అమ్మేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం !

* మొదట మొబైల్ లోని పోటోస్, డాక్యుమెంట్స్, వీడియోస్.. ఇలా అవసరమైనవన్నీ బ్యాకప్ పెట్టుకోవాలి.
* ఇంకా మొబైల్ లోని కాంటాక్ట్స్ ను గూగుల్ మెయిల్ కు లింక్ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల పాత కాంటాక్ట్స్ అన్నీ కూడా తిరిగి పొందే వీలు ఉంటుంది.
* ఆ తరువాత మొబైల్ ను రీసెట్ చేయాలి. అందుకోసం సెట్టింగ్స్ లోకి వెళ్ళి బ్యాకప్ & రీసెట్ సెక్షన్ లో ఫ్యాక్టరీ డేటా రీసెట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మొబైల్ లోని డేటా అంతా కూడా డిలీట్ అవుతుంది.
* ఆ తరువాత తిరిగి మొబైల్ ఆన్ చేసి ఎలాంటి మెయిల్ తో లాగిన్ అవకుండా మొబైల్ ను అమ్మడం చేయాలి.

ఇలా పాత ఫోన్ అమ్మేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి. తద్వారా మన వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి వెళ్లకుండా ఉంటుంది.

Also Read:TTD:న‌డ‌క‌మార్గాల్లో భ‌క్తుల ర‌క్ష‌ణకు చ‌ర్య‌లు

- Advertisement -