మీరు వాడే మెడిసిన్స్ నిజమైనవేనా?

5
- Advertisement -

నకిలీ మందుల ముప్పును ఎదుర్కొనే దిశగా, కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ఎంపిక చేసిన ఔషధాల ప్యాకేజింగ్ లేబుల్స్‌పై QR కోడ్‌లు ముద్రించడం లేదా అతికించడం తప్పనిసరిగా ప్రకటించింది. ఈ చర్య ద్వారా వినియోగదారులు మెడిసిన్ నిజమైనదేనా కాదా అన్నదాన్ని కొనుగోలు సమయంలోనే తనిఖీ చేసుకోవచ్చు.

ఇప్పటి నుంచి 300 ప్రముఖ మందులపై QR కోడ్‌లు తప్పనిసరి చేసింది. 2023 ఆగస్టు 1వ తేదీ నుంచి, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఈ కొత్త నిబంధనను అమలులోకి తీసుకొచ్చింది. QR కోడ్‌లో మెన్యుఫాక్చరర్ పేరు, బ్యాచ్ నంబర్, తయారీ మరియు గడువు తేదీలు, లైసెన్స్ నంబర్, ప్రత్యేక ఉత్పత్తి గుర్తింపు కోడ్ వంటి కీలక సమాచారం ఉంటుంది. ఈ సమాచారం ద్వారా మందు నకిలీదా, అసలిదా అన్నదాన్ని తెలుసుకోవచ్చు.

QR కోడ్‌ను మీ మొబైల్ యాప్ ద్వారా స్కాన్ చేయండి. దీనిద్వారా తయారీదారుని పేరు,బ్యాచ్ నంబర్,తయారీ, గడువు తేదీలు,లైసెన్స్ నంబర్,ప్రత్యేక ఉత్పత్తి గుర్తింపు కోడ్ ఉండనుంది. ఈ వివరాలు ప్యాకేజింగ్ లేబుల్‌పై ఉన్న వివరాలతో తేడాగా ఉంటే, అది నకిలీ ఔషధంగా భావించాలి. QR కోడ్‌లను తనిఖీ చేయడం ద్వారా నకిలీ మందుల ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఏవైనా తేడాలు గల QR కోడ్‌లు కనిపిస్తే వెంటనే మా శాఖకు తెలియజేయాలి అని అధికారులు తెలిపారు.

మీరు నివేదించవలసిన మార్గాలు:

టోల్ ఫ్రీ నంబర్: 1800 599 6969 (ప్రతి పని దినం ఉదయం 10:30 – సాయంత్రం 5:00 వరకు)
వెబ్‌సైట్: https://dca.telangana.gov.in

Also Read:#Single..వసూళ్ల జోరు

- Advertisement -