ఈ ప్రజా పాలన, పనికిమాలిన పాలనే పిచ్చోని చేతిలో రాయి అయింది అన్నారు బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి. అందంగత్తెలు వస్తున్నారు, కాబట్టి ఎటు చూసినా అందంగా కనిపించాలని రోడ్డు పక్కల అభాగ్యులను ఆగం చెయ్యడం, ఏడిపించుకోవడం పిచ్చి తుగ్లక్ చర్య అన్నారు. నీసుముచ్చోడు కోడిని కోస్తానికి కారణాలు వెతికినట్టు, రేవంత్ రెడ్డి జనాలను ఏడిపిస్తానికి నిత్యం రకరకాల కారణాలు వెతుకుతూ ఉంటడు..రాష్ట్రంలో ఏదో ఒకమూలన ప్రజలు రోడ్డుమీద పడి కన్నీళ్ళు పెట్టకపోతే, వాళ్ళ ఆర్థనాథలు వినకపోతే పాపం నిద్ర పట్టనట్టుంది అన్నారు.
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు గారు అన్న విషయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అర్థం కావడం కష్టంగా ఉంది అన్నారు.
మనుషులను ఖాళీ చేయించి మట్టిగొడలను చూపించడం అదేం అందమే, ఈ అందం తక్కువ తక్కువ ఆలోచన ఏంటో అర్థం కావడం లేదు..మా వరంగల్ ప్రపంచ వారసత్వ నగరం అడుగడుగునా ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు, జలపాతాలు, అటవీ సంపద, పర్యాటక ప్రదేశాలు, బిన్న సంస్కృతులు, అద్భుతమైన శిల్పా సంపద, కళా సంపద అడుగడుగునా అందాలే.. కానీ, వీటన్నింటికి తోడు ప్రజలు కన్నీళ్ళు పెట్టినప్పుడే నిజమైన అందం అవుతుంది అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహారం అందంగా ఉండాలని కనుబొమ్మలు గీక్కుంటున్నట్టు ఉంది….అతిథిదేవోభవా అనేది మన సంస్కృతి కాబట్టి ప్రపంచ నలుమూలల నుండి మన ఓరుగల్లుకు విచ్చేస్తున్న ప్రపంచంలో వివిధ దేశాల నుండి అందాల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన అతిథులను గౌరవిస్తాం. మంచి ఆతిథ్యం కూడా ఇద్దాం. కానీ, పేదల కన్నీళ్లను ఆరపోసి, వాళ్ళ ఆర్థనాతాల తోటి సన్నాయి వాయించి స్వాగతించడం సమంజసం కాదు అన్నారు.
ఎవరి మెప్పు కోసమో మన ప్రజలను ఏడిపించుకోవడం ప్రజా పాలన అనిపించుకోదు….అందాల భామలను తిప్పిస్తే మన ప్రాంత అందం ఏమి పెరగదు. అందమైన పరిపాలన చేసి, ప్రజలు ఆనందంగా ఉండేలా చేస్తే అందం ఆటోమేటిక్ గా పెరుగుతుందన్నారు. ఒకవేళ ప్రభుత్వ స్థలంలో రోడ్డుపైన పర్మినెంట్ స్ట్రక్చర్ (ఇంగ్లీష్ లోనే చెప్పాలి అన్న) నిర్మాణం చేస్తే వారితో మాట్లాడాలి. పేదలు, చిరు వ్యాపారాలు చేసుకోవడం కోసం ఒక మార్కెట్ కట్టించండి, లేదా ఫుట్పార్ట్ స్టాల్ లను ఏర్పాటు చేసి లీజుకు ఇవ్వండి. ఏదైనా ఆలోచన చెయ్యండి. కానీ, ఉన్నఫళంగా కనీసం సామాన్లు తీసుకునే సమయం ఇవ్వకుండా కర్కశంగా కూల్చడం దారుణం అన్నారు.
అసలు, మాట్లాడటం అనే ముచ్చటే లేదా, ఇదేనా మన సంస్కృతి?..ఆకరికి సరిహద్దు సమస్యలపై పాకిస్తాన్ తోని కూడా కూర్చొని మాట్లాడుకొని, యుద్ధం ఆపుకునే పరిస్థితి ఉంది అన్నారు. మన ప్రజలతో, మన ప్రభుత్వానికి మాట్లాడే తీరిక లేదా అసలు…బుల్డోజర్ ఏసుకుని పేదల గూడు కూలగొట్టుడే ప్రభుత్వం పనా? అన్నారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఏదో ఒక మూలన విధ్వంసం జరుగుతూనే ఉంది.. అసలు రేవంత్ రెడ్డి వచ్చింది కూలగొట్టి పీకి పందిరేస్తానికి అన్నట్టుందన్నారు. కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు వీధి వ్యాపారులకు చేసిన నష్టాన్ని అంచనా వేసి వారికి నష్టపరిహారం కట్టించాలి….పేద ప్రజలు వీధి వ్యాపారులు వ్యాపారాలు చేసుకోవడం కోసం ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేయడం, లేదా స్ట్రీట్ స్టాల్స్, ప్రత్యేక వ్యాపార సముదాయాలు ఏర్పాటు దిశగా ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు.
Also Read:మీరు వాడే మెడిసిన్స్ నిజమైనవేనా?

