సంక్షేమం.. గట్టెక్కిస్తుందా?

21
- Advertisement -

ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను అధికార వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలగా ఉంది. పైగా ఈసారి ప్రత్యర్థి పార్టీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలనే టార్గెట్ తో ఉంది. మరి ఇంతటి భారీ లక్ష్యాన్ని చేధిస్తామని ఆ పార్టీ ఎందుకు ధీమాగా ఉందంటే సంక్షేమమే గట్టెక్కుస్తుందని జగన్ నమ్ముతున్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా 12.84 కోట్ల మందికి లబ్ధి చేకూర్చినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. .

డైరెక్ట్ డీబీటీ ( direct benfit transfer ) ద్వారా .రూ. 2.58,855.94 కోట్లు నాన్ డీబీటీ ( non direct benfit transfer ) ద్వారా రూ. 1,79,246.94 కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసినట్లు వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. మొత్తం మీద 2019 నుంచి 2024 వరకు రూ. 4.,38,102.91 కోట్లు బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాల్లోకి లబ్ది చేకూర్చారు సి‌ఎం జగన్మోహన్ రెడ్డి. ఈ స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన పార్టీ మరోటి లేదని, ఈ విధానమే తమకు మరోసారి అధికారాన్ని కట్టబెడుతుందని వైఎస్ జగన్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అమ్మ ఒడి, చేయూత, ఆసరా, రైతు బారోసా, ఫీజు రీయింబర్స్ మెంట్,.. ఇలా ప్రస్తుతం అమలవుతున్న పథకాలు కొనసాగలంటే మళ్ళీ వైసీపీకే అధికారం ఇవ్వాలని, లేదంటే ఈ పథకాలన్ని ఆగిపోతాయని వైఎస్ జగన్ పదే పదే ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇక త్వరలో ప్రకటించబోయే వైసీపీ మేనిఫెస్టోలో మరికొన్ని సంక్షేమ పథకాలను చేర్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓవరాల్ గా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా వైఎస్ జగన్ ఎన్నికల బరిలో నిలవబోతున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. సంక్షేమంపై దృష్టి పెడుతూ అభివృద్దిని గాలికి వదిలేశారనే విమర్శ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ 175 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయగలదా ? సాధ్యమేనా ? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు.

Also Read:Rohith:రోహిత్ రిటైర్మెంట్ అప్పుడే!

- Advertisement -