హీరో విజయ్… డైవర్స్‌ న్యూస్ వైరల్‌!

127
vijay antony
- Advertisement -

విజయ్ ఆంటోనీ… తమిళ సినిమాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా మాంచి మార్కెట్ సంపాదించుకున్నారు. స్టార్ హీరోలకు మాదిరిగా పేరుకు ముందు పేరు తర్వాత పెద్ద టైటిల్స్ ఏమీ లేనప్పటికీ.. ఆడియెన్స్‌ని ఆలోచింపచేసే విధంగా కథలు ఎంచుకుని సినిమాలు చేయడంలో ముందుండే హీరో.

నటుడిగా, సింగర్‌గా,ఎడిటర్‌గా,దర్శక,నిర్మాతగా,సంగీత దర్శకుడిగా ఇలా సినిమాలోని అన్ని క్రాప్ట్‌లపై అవగాహన ఉన్న విజయ్‌…తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఈ హీరోకి సంబంధించిన ఫ్యామిలీ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

త్వరలోనే తన భార్య ఫాతిమాతో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుండగా ఈ అనుమానాలను నిజం చేస్తూ విజయ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే, అది మీరే పరిష్కరించుకోండి. అంతేగానీ మీ మధ్యలో మూడో వ్యక్తికి చోటు ఇవ్వకండి అని తెలిపారు. సినీ నిర్మాత అయిన ఫాతిమాను 2006లో విజయ్ ని పెళ్లి చేసుకోగా, వీరికి ఒక కూతురు కూడా ఉంది.

- Advertisement -