కూరగాయలను పచ్చిగా తింటే ప్రమాదమా?

75
- Advertisement -

కూరగాయలు తినడం వల్ల ఎంతో ఆరోగ్యమని నిపుణులు తరచూ చెబుతుంటారు. మన శరీరానికి అవసరమైన పోషకాలన్నిటికి కూరగాయలే ప్రధానవనరు. కూరగాయలలో విటమిన్ ఏ, సి, డి, ఇ, కే, బి కాంప్లెక్స్ వంటి వాటితో పాటు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి ఎంతో అవసరం. కూరగాయలు తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం దొరుకుతుంది. అంతే కాకుండా కూరగాయలలో కెలోరీలు, మరియు కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ కూరగాయలు తినడం ఎంతో మంచిది. ఇదిలా ఉంచితే కూరగాయలను వండుకొని తినడం సర్వసాధారణం..

కానీ కొందరు కూరగాయలను పచ్చిగా తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఎంతో మంచిదని, శరీరానికి పోషకాలు పుష్కలంగా లభిస్తాయని వారు నమ్ముతుంటారు. కానీ నిపుణులు చెబుతున్నా దాని ప్రకారం కూరగాయలను పచ్చిగా అసలు తినరాదట. ఎందుకంటే కూరగాయలు పండించే క్రమంలో వాటిపై రసాయనికి ఎరువులు హానికరమైన క్రిమిసంహారణిలు వంటివి స్ప్రే చేస్తుంటారు. ఫలితంగా కూరగాయాలపై ఆ రసాయనాలు పెరుకుపోతాయి.

అందువల్ల వాటిని అలాగే తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమయాలు తలెత్తుతాయి. ఇంకా కొన్ని రకాల కూరగాయలలో చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది. ఇది జీర్ణం కావడంకి చాలా సమయం పడుతుంది. ఫలితంగా గ్యాస్టిక్ సమస్యలు, అజీర్తి, వాంతులు, విరోచనలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి కూరగాలయను శుభ్రంగా కడిగి ఉడికించ్జిన తరువాతే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా చిలగడదుంప, బీన్స్, రెడ్ కిడ్నీ బీన్స్, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రస్పెల్స్, బ్రోకలి, పొట్టగొడుగులు వంటి వాటిని పచ్చిగా అసలు తినకూడదట. కాబట్టి కూరగాయల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:బీఆర్ఎస్‌పీపీ నేతగా సురేశ్ రెడ్డి

- Advertisement -