జగన్ తో బీజేపీ అందుకే విభేదిస్తుందా ?

44
- Advertisement -

నిన్న మొన్నటి వరకు బీజేపీ వైసీపీ మధ్య అంతర్గత దోస్తీ ఉందనే వార్తలు బాగా వినిపించాయి. ఎందుకంటే కేంద్రంపై జగన్ ఎలాంటి విమర్శలు చేయకపోవడం, అలాగే ఆయా సందర్భాల్లో కేంద్రం జగన్ కు అండగా నిలుస్తూరావడంతో ఈ రకమైన వార్తలు బాగా పోలిటికల్ సర్కిల్స్ లో బాగా వినిపించాయి. అయితే ఏమైందో తెలియదు గాని అనూహ్యంగా కేంద్ర పెద్దలు వైసీపీపై అనూహ్యంగా విరుచుకు పడుతున్నారు. ఇటీవల ఏపీకి వచ్చిన అమిత్ షా మరియు నడ్డా జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందని, గత నాలుగేళ్ల జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు పెరిగిపోయాయని, అసలు జగన్ కు సిగ్గుందా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు అమిత్ షా.. ఈ రకంగా జగన్ పై బీజేపీ విమర్శలు గుప్పించడం ఇదే మొదటిసారి. అటు జగన్ కూడా బీజేపీతో ఎలాంటి అవసరం లేదని చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ బీజేపీ మధ్య దూరం పెరిగిందనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది. అయితే నిన్నమొన్నటి వరకు రహస్య బంధం కొనసాగిస్తూ వచ్చిన ఈ రెండు పార్టీలు ఇప్పుడేందుకు ఎడమొఖం పెడమొఖం అయ్యాయనే దానిపై రకరకాల వాదనలు పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

Also Read: టి కాంగ్రెస్ లో ” డీకే పాలిటిక్స్ ” !

ప్రస్తుతం ఏపీలో జగన్ పాలనపై కొంత వ్యతిరేకత గట్టిగానే ఎదురవుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అందువల్ల వైసీపీతో ఏమాత్రం స్నేహబంధం కొనసాగించిన అది బీజేపీపై కూడా ప్రభావం చూపుతుందని భావించిన పెద్దలు.. వైసీపీతో తమకు సంబంధం లేదని వ్యక్తపరిచేందుకే జగన్ పై విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది. ఇంకా టీడీపీ జనసేన మరియు బీజేపీ కూటమిగా ఏర్పడే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే బీజేపీ వైసీపీని దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో బీజేపీ వేసిన రివర్స్ గేర్ వైసీపీని గట్టిగానే ఇరుకున పెడుతోంది.

Also Read: పవన్ ఫోకస్ తెలంగాణపై మళ్లిందా ?

- Advertisement -