కర్నాటక మేనిఫెస్టో రిపీట్..కాంగ్రెస్ ప్లాన్ అదే!

31
- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ లో ఉంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే ధీమాతో హస్తం నేతలు ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే స్క్రినింగ్ కమిటీ ఏర్పాటు చేసి అభ్యర్థుల ఎంపికలో ముమ్మర కసరత్తులు చేస్తోంది టి కాంగ్రెస్. ఇక వచ్చే నెల నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపేరు గట్టిగా వినిపించేలా ప్లాన్ చేస్తోంది హైకమాండ్. రేస్ లో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించడమే కాకుండా మేనిఫెస్టో కూడా వచ్చే నెలలోనే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 17న హదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. .

ఈ సభకు సోనియా గాంధీ రాబోతున్నాట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. అంతే కాకుండా సోనియా గాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటు ప్రస్తుతం అవినీతిరహితంగా ఉన్న 28 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉందట. దీన్ని బట్టి చూస్తే వచ్చే నెల నుంచి హస్తం పార్టీ ఎలక్షన్ మూడ్ లోకి వచ్చిసినట్లు క్లియర్ గా తెలుస్తోంది. అయితే హస్తం పార్టీకి సబంధించి ఒక డౌట్ అందరిలోనూ వ్యక్తమౌతోంది. అదే మేనిఫెస్టో అంశం. కర్నాటకలో హస్తం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ఆ రాష్ట్ర ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది.

Also Read:రాజ్యాంగం ఎలా ఏర్పడిందో తెలుసా?

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి, ఇలా చాలా అంశాలు అందరిని ఆకర్షించాయి. దాంతో అక్కడ సక్సస్ అయిన అదే మేనిఫెస్టో ను తెలంగాణలో కూడా రిపీట్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు గుసగుసలు వస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కూడా అదే మేనిఫెస్టోను ప్రకటించి కొంత విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు టి కాంగ్రెస్ కూడా సేమ్ కర్నాటక మేనిఫెస్టోనే తెలంగాణలో ప్రకటిస్తే రాష్ట్ర ప్రజలు ఎంతవరుకు స్వాగతిస్తారనేది ఆసక్తికరమే. అయితే ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు కచ్చితంగా టి కాంగ్రెస్ మేనిఫెస్టో లో కూడా ఉండే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి కర్నాటక లో సక్సస్ అయిన ప్రణాళికలు, వ్యూహాలతో పాటు మేనిఫెస్టో కూడా రిపీట్ చేస్తుండడం ఆ పార్టీకి ఎంతవరుకు కలిసొస్తుందో చూడాలి.

Also Read:లోకమాన్య..బాలగంగాధర్ తిలక్

- Advertisement -