టీడీపీకి ఆ ఛాన్స్ ఉందా?

42
- Advertisement -

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కొత్త కొత్త సర్వేలు పుట్టుకొస్తున్నాయి. ఆ సర్వేలు చెబుతున్నా ఫలితాలు ప్రధాన పార్టీలను కలవర పరుస్తున్నాయి. ఎందుకంటే ఏ సర్వే కూడా ఒకే పార్టీకి స్పష్టమైన అధికారాన్ని కట్టబెట్టడం లేదు. కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తే మరికొన్నేమో టీడీపీ అనుకూలంగా వస్తున్నాయి. దీంతో ప్రజాభిప్రాయం ఎలా ఉందని తెలుసుకోవడం ప్రధాన పార్టీలకు అంతు చిక్కడం లేదు. కాగా ఇప్పటివారు వచ్చిన చాలా సర్వేలు వైఎస్ జగన్ కె ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాయి. అదేవిధంగా టీడీపీని కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదని వైసీపీకి సమంగా ఫలితాలు రాబట్టిన ఆశ్చర్యం లేదని చెబుతున్నాయి. ఇక తాజాగా మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వే ఫలితాలు వైసీపీ ఒక్కసారిగా కంగుతినేలా చేశాయి.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాలను స్వతంత్రంగా గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో 25 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తున్న వైసీపీకి ఇది మింగుడు పడని విషయమే. అయితే ఆ మద్య విడుదలైన నవభారత్, టైమ్స్ నౌ వంటి సర్వేలు వైసీపీ 24 లోక్ సభ స్థానాలను కట్టబెట్టాయి. దీంతో క్షణక్షణం మారుతున్న సర్వేల ఫలితాలు ఏపీ పోలిటికల్ హీట్ ను అంతంతంగా పెంచేస్తున్నాయి. అయితే తాజా సర్వేతో టీడీపీ సింగిల్ గానే సత్త చాటే అవకాశం ఉందని తేలిపోవడంతో జనసేన బీజేపీ పార్టీలతో పొత్తు కోసం వెంపర్లాడల్సిన పని లేదనేది కొందరి అభిప్రాయం. ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయనేది కొందరు విశ్లేషకుల అభిప్రాయం. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి టీడీపీ భారీగా సీట్లు పెరిగే ఛాన్స్ ఉందట. ప్రస్తుతం టీడీపీ శ్రేణులు 160 సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీని దాటుకొని టీడీపీకి ఆ స్థాయి విజయం లభిస్తుందా అనేది ప్రశ్నార్థకమే.

Also Read:బెండకాయ సర్వ రోగనివారిణి..!

- Advertisement -