తెలంగాణలో కేసిఆర్ సర్కార్ చేస్తున్న అభివృద్ది ఎలాంటిదో యావత్ దేశం మొత్తం చూస్తోంది. దేశ ప్రజలంతా కూడా తెలంగాణ మోడల్ అభివృద్దిని కోరుతుంతున్నారు. తెలంగాణ ముఖమంత్రి బిఆర్‌ఎస్ తో జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టగానే దేశం నలుమూలల నుంచి ఏ స్థాయిలో మద్దతు లభించిందో అందరం చూశాం. దేశ వ్యాప్తంగా ఎంతోమంది కీలక నేతలు, రైతు సంఘాలు కేసిఆర్ తో కలిసి నడిచేందుకు ముందుకు వస్తున్నాయి. మరి కేసిఆర్ నాయకత్వానికి ఎందుకు ఈ స్థాయిలో మద్దతు లభిస్తుందంటే.. తెలంగాణలో ఆయన చేసిన అభివృద్దే అందుకు నిదర్శనం.
రైతులను ఆధుకోవడంను, యువత కు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ, పరిశ్రమలను నెలకొల్పడంలోనూ, పెట్టుబడులను ఆకర్షించడంలోనూ ఇలా అన్నీ రంగాల్లో కూడా తెలంగాణ అగ్రపథం దూసుకుపోతుంది. ఒకవిధంగా చెప్పాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ గా చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా జరగని అభివృద్ది తెలంగాణలో జరుగుతుంది అనేది అక్షర సత్యం. దాంతో కేసిఆర్ చేస్తున్న అభివృద్ది చేసి.. కేంద్రమే కుల్లుకునే పరిస్థితి. అందుకేనేమో ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఇరకాటంలో పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నప్పటికి బీజేపీ చేతులు కాల్చుకుంటూనే ఉంది. ఇక తాజాగా తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రి కేసిఆర్ టార్గెట్ గా ఎన్నో విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రాజెక్ట్ లను అడ్డుకుంటోంది అనే ఎన్నో ఆరోపణలు చేశారు. అయితే ఇక్కడ మోడీ చెప్పేవన్నీ అబద్దలే అని యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలుసు. అయినప్పటికి ముఖ్యమంత్రి కేసిఆర్ పై మోడీ బురద చల్లే ప్రయత్నమే గాని ఇంకోటి లేదనేది అక్షర సత్యం. ఒకవేళ మోడీ అన్నట్లుగా తెలంగాణలో అభివృద్ది జరగలేదనే ఆరోపణలపై కేసిఆర్ తో చర్చకు సిద్దామా అని బిఆర్‌ఎస్ నేతలు సవాళ్ళు విసురుతున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులను దారిమళ్లిస్తున్నది కేంద్రం కాదా ? వీటన్నిటిపై కేసిఆర్ తో చర్చకు సిద్దామా అని బిఆర్‌ఎస్ నేతలు చెబుతుననృ. అయితే ఈ సవాళ్లను స్వీకరించే దమ్ము బీజేపీ నేతల్లో లేదనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఎందుకంటే బీజేపీ నేతలు చేస్తే ఆరోపణలన్ని ఒట్టి గాలి మాటలు తప్పా.. అందులో ఎలాంటి వాస్తవాలు ఉండవనేది జగమెరిగిన సత్యం.
ఇవి కూడా చదవండి..