చంద్రబాబుకు సానుభూతి వర్కౌట్ అయ్యేనా?

37
- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన సంగతి విధితమే. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మొదటిసారి చంద్రబాబు జైలు కు వెళ్ళడం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధినేత లేకపోవడం ఆ పార్టీని కుదేలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబుకు బెయిల్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న టీడీపీకి చంద్రబాబు అరెస్ట్ కావడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

అక్రమంగా జైలు కు పంపించారనే సానుభూతి కలిసొస్తుందా లేదా అవినీతి మారక కారణంగా పార్టీకి ప్రతికూలంగా మారుతుందా అనేది అంచనా వేయలేని ప్రశ్నలుగా మారాయి. అయితే చంద్రబాబును కక్ష పూరితంగా జైలుకు పంపించారనే నినాదంతో సానుభూతి సంపాదించుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అయితే ఈ సానుభూతి వర్కౌట్ అవుతుందా అంటే ఏపీ రాజకీయ చరిత్రను చూస్తే ఏ మాత్రం వర్కౌట్ కాదనే అభిప్రాయాలూ వ్యక్తమౌతున్నాయి.ఎందుకంటే 1994లో కాంగ్రెస్ ను చిత్తు చేసి మొదటిసారి ప్రాంతీయపార్టీని గెలిపించిన ఎన్టీ రామారావు.. ఆ తరువాత పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళిన తరువాత ప్రజల్లో సానుభూతి కోరుతూ ప్రత్యేక పార్టీ పెట్టి పోటీ చేసినప్పటికీ ప్రజలు ఎన్టీ రామారావుకు ఓటమినే కట్టబెట్టారు.

ఇక 2003 అలిపిరి బ్లాస్ట్ తరువాత అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన చంద్రబాబుకు కూడా సానుభూతి వర్కౌట్ కాలేదు. ఆ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఇక 2012 లో జైలు పాలు అయిన జగన్.. ప్రజల్లో సానుభూతి కోరినప్పటికి 2014 ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఇలా ఏపీ రాజకీయాల్లో సానుభూతి వర్కౌట్ అయిన దాఖలాలు లేదు. దీంతో ప్రస్తుతం చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపించారనే సానుభూతిని టీడీపీ కోరుకుంటున్నప్పటికి. అది వర్కౌట్ అవదేమో అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మరి ముందు రోజుల్లో టీడీపీ ఎలాంటి ఏజండాతో ముందుకు సాగుతుందో చూడాలి.

Also Read:Hi Nanna Song :రొమాంటిక్ మూడ్‌లో నాని

- Advertisement -