Hi Nanna Song :రొమాంటిక్ మూడ్‌లో నాని

26
- Advertisement -

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’. శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ రొమాంటిక్ సాంగ్‌ని రిలీజ్ చేశారు.

నిన్న సినిమాలోని ఫస్ట్ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయగా ఇవాళ సమయమా.. అంటూ సాగే పూర్తి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ హీరో – హీరోయిన్స్ మధ్య సాగే ఒక మంచి రొమాంటిక్ లవ్ సాంగ్. అందరిని ఇంప్రెస్ చేస్తోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -