IPL 2024 :ఎస్‌ఆర్‌హెచ్ తప్పు చేస్తుందా?

27
- Advertisement -

మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్నీ జట్లు కూడా టోర్నీ కోసం సిద్దమౌతున్నారు. దాదాపు 45 రోజులపాటు సాగనున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తొలి మ్యాచ్ చెపక్ వేధికగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇకపోతే టోర్నీలో ఆడనున్న పది జట్ల కు సంబంధించి కెప్టెన్ ల విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు ఎం‌ఎస్ ధోని, ఆర్‌సి‌బి కి ఫాఫ్ డూప్లెసిస్, గుజరాత్ టైటాన్స్ కు గిల్, కోల్కతా నైట్ రైడర్స్ కు శ్రేయస్ అయ్యర్, ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా, డిల్లీ క్యాపిటల్స్ కు రిషబ్ పంత్, లక్నో కు కే‌ఎల్ రాహుల్, రాజస్తాన్ రాయల్స్ కు సంజూ శాంసన్, పంజాబ్ కు శిఖర్ ధావన్, ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కు పాట్ కమిన్స్ కెప్టెన్స్ గా వ్యవహరించనున్నారు.

ఎస్‌ఆర్‌హెచ్ తప్పు చేస్తుందా
సన్ రైజర్స్ హైదరబాద్ యజమాన్యం కెప్టెన్ విషయంలో తప్పు చేస్తుందా అంటే అవుననే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఎస్ఏ టీ20 లో రెండుసార్లు ఎస్‌ఆర్‌హెచ్ ఛాంపియన్ గా నిలబెట్టిన మార్క్రామ్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి పాట్ కమిన్స్ కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఈ సీజన్ కోసం పాట్ కమీన్స్ కు ఏకంగా రూ.20.5 కోట్లు చెల్లించి టీంలోకి తీసుకుంది ఎస్‌ఆర్‌హెచ్ యజమాన్యం. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియాకు తన అద్బుతమైన కెప్టెన్సీతో అందించాడు. అందుకే భారీ మొత్తంలో డబ్బు చెల్లించి కమీన్స్ ను కొనుగోలు చేసింది ఎస్‌ఆర్‌హెచ్ యజమాన్యం. మరి ఆసీస్ కు వరల్డ్ కప్ అందించిన కమీన్స్ ఎస్‌ఆర్‌హెచ్ కు ఐపీఎల్ ట్రోఫీ అందిస్తాడేమో చూడాలి.

Also Read:Jagan:జగన్ కు భారీ ఓటమి తప్పదా?

- Advertisement -