ఎన్టీఆర్ సరసన నటించనుందా?

24
- Advertisement -

కొత్త కొత్త కాంబినేషన్ లు సెట్ చెయ్యడంలో తెలుగు నిర్మాతలు ఎప్పుడూ ముందు ఉంటారు. అలాంటి ఒక కలయికని ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. అదే ఎన్టీఆర్ – శ్రీలీల కాంబినేషన్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తీయబోతున్న విషయం కొత్తదేమీ కాదు. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రకటన వచ్చి చాలా కాలం అయింది. “దేవర” సినిమా విడుదల తరువాత ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో శ్రీలీల నటించనుంది అని ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు.

కానీ, ఇప్పటివరకు హీరోయిన్ గురించి ఆలోచించలేదు ప్రశాంత్ నీల్. ఎందుకంటే, ఎన్టీఆర్ సినిమాకి ఒక స్టోరీ లైన్ అనుకున్నప్పటికీ దాన్ని పూర్తి స్క్రిప్ట్ గా ఇంకా మలచలేదు ఆ దర్శకుడు. మరో ఐదారు నెలలు పడుతుంది మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యేసరికి. ఇక రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది మొదట్లో కానీ షురూ అవుతుంది. అప్పుడు డేట్స్ అందుబాటులో ఉండే హీరోయిన్ ని చూస్తారు ప్రశాంత్ నీల్. ఐతే, శ్రీలీలని తీసుకుంటారు అని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.

కానీ, ప్రశాంత్ నీల్ అలాంటి లెక్కలు వెయ్యరు. ఎన్టీఆర్ సినిమాలో తారక్ ఒక పోలీస్ అధికారిగా నటిస్తారు. ఆయన సరసన ఎవరు నటిస్తారు అనేది ఇప్పుడే చెప్పలేం. శ్రీలీల నటించొచ్చు, లేకపోవచ్చు. ప్రస్తుతం ఐతే ఆమె పేరుని పరిశీలించలేదు అని టీం చెప్తోంది. ఆ మాటకొస్తే ఏ హీరోయిన్ ని ఇప్పటివరకు అనుకోలేదట. ఒకవేళ శ్రీలీలకి ఎన్టీఆర్ సరసన ఛాన్స్ వస్తే.. ఆమెకి అదృష్టం పట్టినట్టే.

Also Read:రాజ్యసభకు రేణుకా,అనిల్ యాదవ్

- Advertisement -