వైరల్ అవుతున్న ఆ ముగ్గురు భామలు

13
- Advertisement -

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ.. ప్రస్తుతం ఓ ముగ్గురు భామలు వైరల్ అవుతున్నారు. వారిలో ముందుగా శోభితా ధూళిపాళ. ‘గూఢచారి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ బ్యూటీ, తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో శోభిత మాట్లాడుతూ.. తన జీవితానికి అసలైన అర్థం మాతృత్వాన్ని పొందినప్పుడే అని చెప్పింది. ‘అమ్మ అని పిలిపించుకోవడం కోసం ఎదురుచూస్తున్నా. నిజంగా ఆ అనుభూతిని ఎప్పుడు పొందుతానో కానీ అదొక అద్భుతంగా ఫీలవుతా’ అని చెప్పుకొచ్చింది. కాగా, ఆ మధ్య నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారంటూ రూమర్లు వచ్చాయి.

ఇక మరో హీరోయిన్ విషయానికి వస్తే.. బాలీవుడ్ నటి సారా అలీఖాన్. లగేజీతో కిక్కిరిసిన రైల్లో ఎక్కడం, ఆటోవాలాతో ధర తగ్గించమంటూ బేరాలాడటం, రోడ్డు పక్క కాకా హోటళ్లలో తినడం, సాధారణ ప్రజలకు పర్యటనల్లో జరిగే అనుభవాలే ఇవి. కానీ, ఓ స్టార్‌ హీరోయిన్ కూడా ఇంత సాధారణంగా ఉంటారని నిజం చేసి చూపిస్తోంది సారా అలీఖాన్. ఏ మాత్రం ఖాళీ దొరికినా విహారయాత్రకు వెళ్తుంటోంది. చిన్న హోటళ్లలోనే బస చేస్తుంది. ఆమె సింప్లిసిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ముచ్చటగా మూడో భామ విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ‘డాన్‌-3’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఇలాంటి యాక్షన్‌ సినిమాలు చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది. నటిగా విభిన్న ప్రాత్రలు చేస్తూ.. అలాంటి పాత్రలే మీకు సరైనవి అని ప్రపంచం అనుకునేలా చేయాలనేది నా అభిప్రాయం అని చెప్పుకొచ్చింది. అలాగే ఈ సినిమాలో బికినీ కూడా వేస్తున్నట్లు కియారా స్పష్టం చేసింది.

Also Read:ఎక్కువసార్లు టీ తాగితే..ఆ లోపం వస్తుందా!

- Advertisement -