‘రాజమౌళి’ని వదిలేసి రిస్క్ చేశాడా?

52
- Advertisement -

సినిమా కోసం ఎంతమంది ఎంత కష్టపడ్డా.. సినిమాకు ప్రాణం మాత్రం దర్శకుడే. అతనే రాజు. అతనే దార్శనికుడు. అందుకే, ప్రతి ఒక్కరూ అతను చెప్పిన విధంగానే పని చేస్తారు. ఎంత గొప్ప స్టార్ అయినా.. దర్శకుడు చెప్పింది చేయాల్సిందే. బహుశా అందుకే కావొచ్చు. ఇండ‌స్ట్రీకి ఏ కార‌ణంతో వ‌చ్చినా, తాము కూడా ఓ సినిమా డైరెక్ట్ చేయాల‌నే కోరిక చాలా మందికి ఉంటుంది. సినిమాటోగ్రాఫ‌ర్ సెంథిల్‌కు కూడా అదే కోరిక ఎప్పటి నుంచో ఉంది. పైగా ఎంతో కాలంగా తాను డైరెక్ట‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటూ.. ఆ దిశగా సెంథిల్, ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాడు.

ఐతే, చాలా కాలం తర్వాత సెంథిల్ కోరిక నెరవేరబోతోంది. సెంథిల్ త్వ‌ర‌లోనే మెగాఫోన్ ప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. దాని కోసం ఇప్ప‌టికే క‌థ‌ను రెడీ చేసుకుని నిర్మాత‌ల‌ను కూడా సెట్ చేసుకున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే సెంథిల్ మూవీపై అనౌన్స్‌మెంట్ రానుంది. రాజ‌మౌళి సినిమాల్లో విజువ‌ల్స్ ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వాటికి కార‌ణం సినిమాటోగ్రాఫ‌ర్ సెంథిల్. ఆయ‌న‌ ప‌నిత‌నాన్ని హాలీవుడ్ టెక్నీషియ‌న్లు సైతం మెచ్చుకున్నారు. అలాంటి సెంథిల్ ఇప్పుడు తానే స్వయంగా డైరెక్షన్ చేస్తున్నాడు అంటే.. ఇక ఆ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

ఒక విధంగా సెంథిల్ తన కెరీర్ నే రిస్క్ లో పెడుతున్నాడు. కారణం.. రాజ‌మౌళి, మ‌హేష్‌తో చేయ‌బోయే సినిమాకు సెంథిల్ ప‌నిచేయ‌డం లేదు. ఇప్పటికే, రాజ‌మౌళి-మ‌హేష్ కాంబోలో రానున్న సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్‌ గా పి.ఎస్ వినోద్ ను తీసుకున్నారు. తాను ఈ సినిమాకి పని చేయలేను అని సెంథిల్ నేరుగా రాజమౌళితో చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే, రాజమౌళి పి.ఎస్ వినోద్ ను ఫైనల్ చేసుకున్నాడు. ఇంతకీ దర్శకుడిగా సెంథిల్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ముఖ్యంగా ఏ హీరోతో సెంథిల్ తన సినిమాని చేస్తాడో, దాని మీదే ఆయన డైరెక్షన్ కెరీర్ ఆధార పడి ఉంటుంది.

Also Read:శనగలు తింటే.. ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -