రాజకీయాల్లోకి సమంత..నిజమేనా?

22
- Advertisement -

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఇలా దేశంలో వెండితెరపై అలరించిన నటీనటులు ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చి ప్రజాక్షేత్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి వారు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పాలిటిక్స్‌లోకి వస్తుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సమంతను BRSలోకి ఆహ్వానించి, స్టార్ క్యాంపెయిన్‌‌నర్‌గా ప్రచారం చేయిస్తే పార్టీకి కలిసి వస్తుందని BRS నేతలు భావిస్తున్నట్లు సమాచారం.

ఆ మధ్య సమంత క్రీడారంగంలోకి అడుగు పెట్టబోతుంది అంటూ పుకార్లు వినిపించాయి. ఆమె టెన్నిస్ జట్టును కొనుగోలు చేసే ఆలోచనలో ఉందని వార్తలు వినిపించాయి. ఐపీఎల్‌, ఫుట్‌ బాల్‌ లీగ్‌, కబడ్డీ లీగ్‌ తరహాలో టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహిస్తున్న హైదరాబాద్‌ జట్టులో సమంత పెట్టుబడులు పెట్టిందని టాక్. కానీ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆ తర్వాత తేలింది. ఇప్పుడు స‌మంత రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. పైగా అధికార BRS పార్టీలో చేర‌బోతుంద‌ని అంటున్నారు.

మంత్రి కేటీఆర్ తో సమంతకు మంచి అనుబంధం ఉంది. ఐతే, ఆ అనుబంధం పాలిటిక్స్ లోకి వచ్చేంత ఉందా ? అంటే.. అనుమానమే. మరి సమంత నిజంగానే రాజకీయాల్లోకి వస్తోందా ?, వస్తే.. ఆమె గెలవగలదా ? చూడాలి. ప్రస్తుతానికి అయితే, సమంత ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ లోపు తన అనారోగ్య సమస్యల నుంచి బయట పడాలని ప్రయత్నాలు చేస్తోంది.

Also Read:ఉదయనిధిపై సీరియస్ కామెంట్స్

- Advertisement -