రోజా నిర్మాతగా సక్సెస్ అవుతుందా?

30
- Advertisement -

నటిగానే కాకుండా మంత్రిగా కూడా రోజాకి మంచి గుర్తింపు ఉంది. అయితే, ఆమె తన భర్త సెల్వమణి తో కలిసి సరదాగా ఫోటోలు దిగింది. ఆ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే.. రోజా ఫోటోను పోస్ట్ చేయగానే.. దాని పై ఓ నెటిజన్ ‘కాకి ముక్కుకు దొండ పండు’ అంటూ చాలా నీచమైన కామెంట్ పెట్టాడు. సహజంగా ఇలాంటి కామెంట్లను ప్రముఖులు పట్టించుకోరు. అయితే, ఈ కామెంట్ ను చూసిన రోజా అభిమానులు మాత్రం చాలా సీరియస్ అవుతున్నారు. మరోపక్క మరికొంతమంది తుంటరి నెటిజన్లు కూడా ‘నీ భర్త ముసలోడు’ అంటూ రోజా పై ట్రోలింగ్ కి దిగారు.

సోషల్ మీడియా వచ్చాక, అసలు విలువులు కూడా లేకుండా పోతున్నాయి. పబ్లిక్ గా బూతులు తిట్టుకునేంతగా కొందరు దిగజారిపోతున్నారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక మంత్రి రోజాగారి విషయానికి వస్తే.. ఆమె మంత్రి అయిన తర్వాత.. ఆమెలో చాలా మార్పులు వచ్చాయి. ట్రెండ్ కి తగ్గట్టు లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. సరదాగా ఆమె పబ్లిక్ పార్టీలలో కూడా పాల్గొంటుంది. అయితే, రోజాకి మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె నిర్మాతగా మారబోతున్నారు అని టాక్.

అందుకే, ఈ వార్త పై కూడా కొందరు నెటిజన్లు రోజాని ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది అనేది రోజా క్లారిటీ ఇస్తే గానీ, అసలు నిజం తెలియదు. అన్నట్టు సినీ నిర్మాణంతో పాటు అటు డిజిటల్ రంగం లోకి కూడా రోజా గారు కూడా ఎంటర్ కానున్నారట. రోజా భర్త సెల్వమణి చిన్న చిన్న ఓటీటీ చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉన్నారట. రోజానే నిర్మాతగా వ్యవహరించే విధంగా సెల్వమణి కూడా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. కాగా నటిగా, మంత్రిగా ఎంతో పాపులారిటీ సాధించిన రోజా, మరి నిర్మాతగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Also Read:ఇమ్యూనిటీ పెంచుకోండిలా!

- Advertisement -