మహేష్ డిస్కషన్స్.. దాని కోసమే

30
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే, రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్స్ సూపర్ హిట్ అవడమే కాదు.. నేషనల్ వైడ్ గా ఫుల్ పాజిటివ్ కామెంట్స్ వినిపించాయి. పైగా ప్యాన్ ఇండియా స్టార్ గా మహేష్ చేస్తున్న మొదటి సినిమా కూడా ఇదే. దీనికితోడు జనవరి 12 న విడుదలకు సిద్దమవుతుంది. అంటే మరో ఇరవై రెండు రోజుల్లో గుంటూరు కారం ఆగమననానికి రెడీ అవుతుంది. కానీ హారిక హాసిని ఫిలిమ్స్ వారు గుంటూరు కారం ప్రమోషన్స్ ని ఇతర భాషల్లో పిచ్చ లైట్ తీసుకుంటున్నారు.

జనవరి 6 న గుంటూరు కారం ట్రైలర్ ను వదిలాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ, మిగిలిన భాషల్లో ఏదో నామ్ కే వాస్తు లాగా ఆయా భాషల్లోని స్టార్ల చేత ఓ ట్వీట్ రూపంలో గుంటూరు కారం ట్రైలర్ ను వదిలేలా ప్లాన్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మరీ ఇలా చేతులు ఎందుకు దులిపేసుకుంటున్నారు అనేది మహేష్ ఫ్యాన్స్ కి అర్ధం కావడం లేదు. నిజానికి గుంటూరు కారం సినిమా ట్రైలర్ కి భీబత్సమైన హైప్ వచ్చేసింది.. ఇకపై ప్రమోషన్స్ అక్కర్లేదు అనుకుందామనుకుంటే గుంటూరు కారం స్టిల్స్ పై సాంగ్స్ పై కామెడీ ట్రోల్స్ సోషల్ మీడియాలో కనిపించాయి.

ఇక గుంటూరు కారం నుంచి సరికొత్త టీజర్ రాబోతుంది.. అది కూడా యాక్షన్ టీజర్ అంటూ ప్రచారం జరిగినా.. ఇంతవరకు దాని గురించి ఎలాంటి అప్ డేట్స్ ను చిత్రబృందం ఇవ్వలేదు. మరోపక్క గుంటూరు కారం లో ఉన్న మిగిలిన రెండు పాటలు వదలబోతున్నారన్నారు. అవి కూడా ఏవరేజ్ గా ఉన్నాయని టాక్. ఇప్పుడు మేకర్స్ గుంటూరు కారం ట్రైలర్ ని లైట్ తీసుకుంటే అసలుకే ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి, బాగా ప్రమోషన్స్ చేసేలా మహేష్ దర్శకనిర్మాతలతో డిస్కర్షన్స్ చేస్తున్నారట. ముఖ్యంగా ఈ ఇరవై రోజుల్లో ఐదు భాషల్లో బాగా ప్రమోషన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read:పొత్తు పంచాయతీ..తేలేదెప్పుడు?

- Advertisement -