వచ్చే ఐపీఎల్.. చెన్నైలోకి రోహిత్ ?

57
- Advertisement -

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఈ సీజన్ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలీసిందే. ముంబై జట్టుకు నాలుగు టైటిల్స్ అందించించిన రోహిత్ శర్మను అనూహ్యంగా కెప్టెన్సీ నుంచి తప్పించడం పై సర్వత్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సీజన్ ఐపీఎల్ లో ముంబై జట్టు కు హర్ధిక్ పాండ్య కెప్టెన్ గా వ్యవహరించనుండగా రోహిత్ కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ ఐపీఎల్ లో రోహిత్ ముంబై జట్టును వీడే అవకాశాలు ఉన్నట్లు గత కొన్నాళ్లుగా క్రీడా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ నిజంగానే ముంబై జట్టును వీడితే వచ్చే ఏడాది చెన్నై తరుపున కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎం‌ఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్. వచ్చే ఏడాది అతను ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ధోని రిటైర్ అయితే సి‌ఎస్‌కే తరుపున రోహిత్ ఆడాలని కోరుకుంటున్నట్లు క్రికెటర్ అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు. ధోని లాగా రోహిత్ కూడా సమర్థమైన కెప్టెన్ అని అతడు ఏ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన అద్బుత ఫలితాలు సాధిస్తాడని చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ సన్ రైజర్స్ జట్టు కు ఆడాలని మరికొందరు కోరుకుంటున్నారు. ఎస్‌ఆర్‌హెచ్ కూడా నాయకత్వ లోపంతో గత సతమతమౌతోంది. అందువల్ల రోహిత్ శర్మ ఎస్‌ఆర్‌హెచ్ లోకి ఎంట్రీ ఇస్తే ఆ జట్టు పటిష్టంగా తయారవుతుందనేది కొందరి క్రీడ విశ్లేషకుల అభిప్రాయం. మరి ఐపీఎల్ లో కెప్టెన్సీ కి దూరమైన రోహిత్ శర్మ.. వచ్చే ఏడాది ముంబై కి కూడా దూరమౌతాడా ? లేదా ముంబైలోనే కొనసాగుతాడా ? అనేది చూడాలి. ఇక ఈ సీజన్ ఐపీఎల్ 22న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ చెన్నై మరియు బెంగళూరు మధ్య జరగనుంది. ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ను గుజరాత్ జట్టుతో 24న తలపడనుంది.

Also Read:గంగా ఎంటర్‌టైన్మెంట్స్..’శివం భజే’

- Advertisement -