శరవేగంగా పుష్ప 2..షూటింగ్!

7
- Advertisement -

పుష్ప చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సాధించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యంతో పాటు ఆ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట విశ్వ‌రూపంకు ఫిదా అవ్వ‌ని వారు లేరు. ఈ చిత్రంతో ఆయ‌న‌కు ల‌భించిన పాపులారిటీతో ప్ర‌పంచంలో ఏ మూలాన వెళ్లిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తార‌స‌ప‌డ‌తారు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. అందుకే ఐకాన్‌స్టార్ ఎక్క‌డికి వెళ్లిన ఆయ‌న‌కు అభిమానుల చేత గ్రాండ్ వెల‌క‌మ్ ల‌భిస్తుంది.

తాజాగా ఆయ‌న న‌టిస్తున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ షూటింగ్ ఏక‌ధాటిగా జ‌రుగుతుంది. బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేట్‌తో మైత్రీమూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది. న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ నిర్మాత‌లు. కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈ రోజు నుంచి వైజాగ్‌లో ప్రారంభ‌మైంది.

అత్యంత కీల‌కంగా భావించే ఈ షెడ్యూల్‌లో కోసం వైజాగ్ వెళ్లిన ఐకాన్‌స్టార్‌కు అల్లుఅర్జున్‌కు అక్కడి అభిమానులు, గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పారు.

Also Read:స్టోన్ ఫ్రూట్స్ తో క్యాన్సర్ కు చెక్!

- Advertisement -