Revanth Reddy:రేవంత్ రెడ్డి టీడీపీ కోసమేనా?

86
- Advertisement -

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీడీపీ కోసం పని చేస్తున్నారా ? ఆయన కాంగ్రెస్ లో ఉంటూనే టీడీపీ కాంగ్రెస్ మద్య దోస్తీ కోసం పని చేస్తున్నారా ? టీడీపీ విషయంలో అసలు రేవంత్ రెడ్డి ఎందుకు పాజిటివ్ గా ఉన్నారు ? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఎందుకంటే ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలే అందుకు కారణం. తాను టీడీపీకి ఎప్పటికీ కట్టుబడి ఉంటానని, తెలుగుదేశం పార్టీ తనకు పుట్టినిల్లు లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలే కొత్త చర్చలకు తావిస్తున్నాయి. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా రేస్ నుంచి తప్పుకుంది. దాంతో తెలంగాణ టీడీపీ శ్రేణులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా.

అయితే టీడీపీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నప్పటికి ఆ పార్టీ మద్దతు కాంగ్రెస్ కు ఉంటుందనే వాదన గత కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఎందుకంటే 2018 ఎన్నికల ముందు టీడీపీ కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన సంగతి విధితమే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలిపేందుకే టీడీపీ ఎన్నికల రేస్ నుంచి తప్పుకుందనేది కొందరి వాదన. కాంగ్రెస్ టీడీపీ మద్య వారధిలా ఉంటూ రేవంత్ రెడ్డే రెండు పార్టీల మద్య అంతర్గత పొత్తుకు దారి వేస్తున్నదనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే ఈ పొత్తు కాంగ్రెస్ కోసం కాకుండా టీడీపీ కోసమే రేవంత్ రెడ్డి పని చేస్తున్నారనేది కొందరి మాట.

చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ ను వాడుకుంటున్నారని హస్తం కాంపౌండ్ లోనే గుసగుసలు నడుస్తున్నాయి. ఇటీవల టీడీపీ విషయంలో రేవంత్ రెడ్డి పాజిటివ్ గా స్పందించడంతో ఆ రకమైన వార్తలకు మరింత బలం చేకూరుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఓడిన రేవంత్ రెడ్డి కి ఎలాంటి నష్టం ఉండదని, ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఆయన టీడీపీ గూటికి చేరుకునే అవకాశాలే ఎక్కువ అనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి టీడీపీ విషయంలో రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉండడం పలు అనుమానాలకు తవిచ్చే అంశం.

Also Read:Saindhav:‘సైంధవ్’ ఫస్ట్ సింగిల్

- Advertisement -