కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తారా?

70
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ మద్య తెగ హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ హడావిడి అంతా పైపైనే. లోలోపల మాత్రం మూకుమ్మడి కుమ్ములాటలు గట్టిగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా టికెట్ల విషయంలో ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన హస్తం పార్టీ రాబోయే రెండు మూడు రోజుల్లో రెండో జాబితాను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని కొందరు హస్తం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన వారికి టికెట్ల కేటాయింపు జరపకుండా.. తమకు నచ్చినవారికే టికెట్లు కేటాయిస్తున్నారని వాపోతున్నారు..

ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కనుసైగల్లోనే టికెట్ల కేటాయింపు జరుగుతోందట. తాను డిమాండ్ చేసిన డబ్బు ఇచ్చినవారికే రేవంత్ రెడ్డి సీటు ఇస్తున్నారని పార్టీలోని కొందరు నేతలు బహిరంగంగానే వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి పై ఈడీకి ఫిర్యాదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. టికెట్ల కేటాయింపుకు సంబంధించి రెండు నెలల ముందు నుంచే అధిష్టానానికి తప్పుడు లెక్కలు చూపిస్తూ రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత కురువ విజయ్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన బయటపెట్టినందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని విజయ్ కుమార్ చెబుతున్నారు.

కాగా రేవంత్ రెడ్డి వైఖరి పట్ల మొదటి నుంచి కూడా చాలా మంది హస్తం నేతలు అసహనంగానే ఉన్నారు. రేవంత్ ఏకీకృత నిర్ణయాలు తీసుకుంటారని, పార్టీలో ఎవరిని ఎదగనివ్వరని ఇలా రకరకాల విమర్శలు తరచూ తెరపైకి వస్తూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి వైఖరి కరణంగానే చాలా మంది నేతలు కాంగ్రెస్ విడారు కూడా. పార్టీలోని సీనియర్ నేతలు మరియు రేవంత్ రెడ్డి మద్య ఇప్పటికీ కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనెంతలా వివాదాలు కొనసాగుతున్నాయి. ఇలా ఏ రకంగా చూసిన పార్టీలోని మెజారిటీ నేతలు రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత ఉన్నవాళ్లే. గతంలో టీడీపీకి వెన్నుపోటు పొడిచిన రేవంత్ రెడ్డి అదే విధంగా కాంగ్రెస్ కు కూడా వెన్నుపోటు పోల్డుస్తాడేమో అనే అనుమానం అందరిలోనూ ఉంది. ప్రస్తుతం ఆయన వైఖరి చూస్తుంటే పార్టీలోని నేతల అనుమానలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయనేది కొందరి అభిప్రాయం.

Also Read:18 ఏళ్ల కుర్రాడితో త్రిష బరితెగింపు

- Advertisement -