సినిమా ఇండస్ట్రీలో తరుచుగా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అభిమానులతో పాటు కొందరు ఆయా హీరోల బ్యాచ్ లు కూడా సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటూ ఉంటారు. అయితే, ఎవరు అయితే ఎక్కువ డబ్బులు పెట్టి ప్రమోషన్స్ చేసుకుంటారో.. వారే చివరకు ఆయా బిరుదులను పట్టుకుపోతారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అనే బిరుదు దగ్గర గందరగోళం నెలకొంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటూ ప్రస్తుతం మెగా కాంపాండ్ నుంచి హడావుడి ఎక్కువ అయ్యింది. ఆ హడావుడిని చరణ్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున నినాదంగా మార్చుకుని తమ హీరో రేంజ్ ని ప్రపంచానికి ఘనంగా చాటుకుంటున్నారు. నిజంగా చరణ్ కి గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు.
కానీ, చరణ్ ఒక్కడికే ఈ ఇమేజ్ రాలేదు కదా. ఎన్టీఆర్ కి కూడా ఆ ఇమేజ్ వచ్చింది. వీరిద్దరి కంటే ముందు ప్రభాస్ కి ఆ ఇమేజ్ వచ్చింది. అయినా, ఆస్కార్ వచ్చింది నాటు నాటు పాటకు, నటనకు కాదు కదా. ఆ మాటకొస్తే.. ఆస్కార్ నిర్వాహకులు ఎన్టీఆర్ నటనకు తగిన గౌరవం ఇచ్చారు. ఆస్కార్ అవార్డు ఇచ్చే సమయంలో ఎన్టీఆర్ ను హైలైట్ చేస్తూ తమ అవార్డును ప్రధానం చేశారు. ఈ లెక్కన చరణ్ కంటే.. ఎన్టీఆర్ కే ఎక్కువ గ్లోబల్ ఇమేజ్ వచ్చింది.
మరి ఈ ఇమేజ్ ప్రకారం.. చరణ్ కంటే కూడా ఎన్టీఆరే గ్లోబల్ స్టార్ గా పిలిపించుకోవడానికి సంపూర్ణ అర్హుడు. కానీ, ప్రస్తుతం మెగా సన్నిహితులు పోటీ పడి మరీ చరణ్ ను గ్లోబల్ స్టార్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇందులో తప్పేం లేదు. కానీ, చరణ్ ఒక్కడే గ్లోబల్ స్టార్ అంటే మటుకు కచ్చితంగా తప్పే. ఈ విషయంలో ఎన్టీఆర్ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అనవసరమైన ఫేక్ బిరుదుల కోసం ఎన్టీఆర్ తాపత్రయ పడడం లేదు.
ఇవి కూడా చదవండి..