టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఉన్న శర్వానంద్ ఇప్పటికే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో అడుగు పెట్టాడు. ఇదే క్రమంలో రామ్ పోతినేనికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్తో ప్రేమలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తోంది. నిజానికి రామ్ పోతినేని త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారంటూ ఇప్పటికే ఎన్నోసార్లు పుకార్లు జోరుగా సాగాయి.
ముఖ్యంగా స్కూల్ డేస్ నుంచే ఓ అమ్మాయితో రామ్‌కు పరిచయం ఉందని.. ఇంతకాలం ఫ్రెండ్స్‌గా కొనసాగిన ఈ జంట, పెళ్లి వైపుగా అడుగు లేస్తున్నారని పుకార్లు పుట్టించారు. అయితే, ఇదే విషయం పై రామ్ టీమ్ ను అప్రోచ్ అయితే.. ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. అలాగే అనుపమ పరమేశ్వరన్తో కూడా రామ్ ప్రేమలో ఉన్నట్టు వస్తున్న వార్తల్లో కూడా ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. పైగా రామ్ కి ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదు అని, ప్రస్తుతానికి తన కెరీర్ పైనే రామ్ ఫుల్ ఫోకస్ పెట్టాడని అంటున్నారు.
అయినా, త్వరలో ఫలానా హీరో పెళ్లి చేసుకోబోతున్నాడు అని పుకార్లు షికార్లు చేయడం తెలుగు సోషల్ మీడియాకి కొత్తేమీ కాదు. అన్నట్టు మీ పెళ్లి ఎప్పుడు? అని రామ్ ని అడిగితే.. ఇప్పట్లో లేదు అంటూ క్లారిటీ ఇస్తున్నాడు. మే 15, 1988లో రామ్ జన్మించాడు. రామ్ వయసు ప్రస్తుతం 35 సంవత్సరాలు. మరి పెళ్లి వయసు దాటిపోయినా రామ్ మాత్రం పెళ్లికి తొందర పడటం లేదు.
Also Read:‘జై భారత్’..ఆవిష్కరించిన ప్రకాష్ అంబేద్కర్