Allu Arjun:పుష్ప 2 వెనక్కి తగ్గాల్సిందేనా?

21
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” పుష్ప ది రూల్ “. 2021 లో రిలీజ్ అయిన పుష్ప పార్ట్ 1 కు కొనసాగింపుగా రాబోతున్న ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీని ఈ ఏడాది ఆగస్టు 15 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా ? అనే సందేహాలు సినీ అభిమానుల్లో నెలకొన్నాయి. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ డేట్ ను ఇతర బడా హీరోలు కూడా టార్గెట్ చేశారు. టాలీవుడ్ లో స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్న సింగం రిటర్న్ మూవీ ఆగష్టు లోనే రిలీజ్ కానుంది. ఇక తమిళ్ నుంచి తలపతి విజయ్ నటిస్తున్న ” గోట్ ( గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైమ్ ) ” మూవీ కూడా ఆగష్టు 15 ననే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంకా కన్నడలో శివరాజ్ కుమార్ నటిస్తున్న భైరతి రణగల్ మూవీ కూడా ఆగష్టు నెలనే టార్గెట్ చేసింది. ఇక ప్రతి ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు పుష్ప2 కు పోటీగా రేస్ లో ఉండడంతో పుష్ప వెనక్కి తగ్గుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో ఎలాంటి పోటీ లేనప్పటికి ఇతర ఇండస్ట్రీలో పోటీ ఉండడం వల్ల ఓపెనింగ్స్ పై ప్రభావం చూపుతుంది. అందువల్ల భారీ కలెక్షన్లపై కన్నేసిన పుష్ప2 మూవీ ఇతర సినిమాలతో పోటీ పడితే కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. అందుకే పుష్ప 2 వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే పుష్ప అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందని ఇప్పటికే చిత్రయూనిట్ పలుమార్లు కన్ఫర్మ్ చేసింది. మరి పోటీలో ఎంతమంది ఉన్న పుష్పరాజ్ తగ్గేదేలే అంటాడా ? లేదా సోలో రిలీజ్ డేట్ కోసం వెనక్కి తగ్గుతాడా ? అనేది చూడాలి.

Also Read:నల్లవెల్లుల్లితో ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -