ప్రభాస్.. మరో ఆదిపురుష్ చేస్తావా ఏంటి?

47
- Advertisement -

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ప్రాజెక్ట్-K’ కూడా ట్రోలింగ్ కి గురి అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. సహజంగానే నాగ్ అశ్విన్ మంచి దర్శకుడు. పైగా ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో మొదటి సారి కలిసి పని చేస్తున్నాడు. కాబట్టి.. కచ్చితంగా మంచి సినిమా తీస్తాడు అని అందరూ బలంగా నమ్ముతున్నారు. కానీ, ‘ప్రాజెక్టు -K’ మూవీ నుంచి రిలీజైన ప్రభాస్ లుక్‌ను చూసి అభిమానులు ఒక్కసారిగా అసంతృప్తికి లోనయ్యారు. ఇదేంటి ప్రభాస్ లుక్ ఇలా ఉంది ?, ఈ ఫస్ట్ లుక్ చూసిన ప్రతి ఒక్కరూ ఇలానే ఫీల్ అయ్యారు. ఐరన్ మ్యాన్ పోజులో ఉన్న ఈ లుక్‌లో ‘ప్రభాస్ తల వేరే ఎవరి శరీరానికో అతికించినట్టు ఉంది’ అంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

‘ఇదేం లుక్ బాబు.. ఇంకో ఆదిపురుష్ చేస్తారా ఏంటి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌లోనే ట్రోల్స్‌కు గురవుతోందంటూ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. నిజానికి ఈ ఫస్ట్ లుక్ పై నాగ్ అశ్విన్ శ్రద్ద పెట్టలేదు అనిపిస్తోంది. ఎందుకంటే ఫ్యాన్ మెడ్ పోస్టర్లు కూడా ఇంతకంటే చాలా బాగుంటాయి. కానీ, ఈ పోస్టర్ మాత్రం చాలా అధ్వానంగా ఉంది. ఏది ఏమైనా “ప్రాజెక్ట్ కె” పై, ప్రభాస్ లుక్‌పై ఇంత దారుణంగా ట్రోల్స్ రావడం నిజంగా షాకింగ్ విషయమే.

అమితాబ్, కమల్ హాసన్ లాంటి మహామహా నటులు పని చేస్తున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ, ఇలా నాసిరకం గ్రాఫిక్స్, డిజైన్స్ తో ప్రేక్షకుల మీదకు వదిలితే.. సినిమాకే నష్టం. వాస్తవానికి ప్రభాస్ ఫస్ట్ లుక్… బద్రీనాథ్ సినిమాలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ లా ఉంది. ఆ సినిమాలో బన్నీ ఇచ్చిన ఫోజను ‘ప్రాజెక్ట్ కె’ టీమ్ ప్రభాస్ చేత చేపించారు. ఏది ఏమైనా ఇది ప్రభాస్ ఫస్ట్ లుక్ లా లేదు. ప్రభాస్ మార్ఫింగ్ ఫోటోలా ఉంది.

Also Read:భారీ వర్షాలు..మంత్రి హరీష్ సమీక్ష

- Advertisement -