ప్రభాస్ స్పిరిట్..ప్రకాష్ రాజ్‌ ఔట్?

3
- Advertisement -

స్పిరిట్ సినిమాకు సంబంధించి రోజుకో వార్త టీటౌన్‌లో చక్కర్లు కొడుఉతోంది. తాజాగా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఇక భాగం కాదన్న వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన వివేక్ ఓబెరాయ్ పోస్టర్‌లో ప్రకాష్ రాజ్‌ను ట్యాగ్ చేయకపోవడంతో ఆయన ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ముందుగా ప్రకాష్ రాజ్‌ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా ప్రారంభించలేదని స్పష్టంచేశారు. అయితే తాజా గాసిప్ ప్రకారం, దర్శకుడు సందీప్ వంగా ఆయనను రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని కోరారట. అలాంటి వ్యాఖ్యలు సినిమా మీద ప్రభావం చూపవచ్చని దర్శకుడు భావించారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రకాష్ రాజ్ అటువంటి హామీ ఇవ్వలేదనే కారణంతో ఆయనను మార్చి, ఆయన స్థానంలో వివేక్ ఒబెరాయ్‌ను తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

Also Read:బుర్జ్ ఖలీఫా భవనానికి మంటలు

ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -