రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత తనదైన మార్క్ చూపించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ప్రమాణస్వీకారం రోజునే ఆరు గ్యారెంటీ హామీలపై తొలి సంతకం చేయడం, ఆ మరుసటిరోజే ఉచిత బస్సు ప్రయాణానికి ఉత్తర్వులు జారీ చేయడం, ప్రగతిభవన్ ను ప్రజాభవన్ గా మార్చడం.. ఇలా తన మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు. కాగా ప్రజాభవన్ ముందు ఉన్న బారికేడ్లను తొలగించి ప్రజలకు దగ్గర చేశారు. ప్రజాభవన్ లో ప్రజాదర్బార్ నిర్వహించి సమస్యలకు తక్షణ పరిష్కారం చేసే దిశగా సిఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. త్వరలో ప్రజాదర్భార్ పేరుతో వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా అనే సందేహాలు చాలామందిలో వ్యక్తమౌతున్నాయి..
ఎందుకంటే ప్రజాదర్బార్ నేపథ్యంలో ఎంతోమంది ప్రజలు వారి సమస్యలను విన్నవించుకునేందుకు సిఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కడుతున్నారు. అయితే చాలా మందిని లోపలికి వెళ్లనియకుండా అడ్డుకుంటున్నాట్లు అక్కడి ప్రజలు వాపోతున్నారు. పరిమితి మేర మాత్రమే ప్రజాభవన్ లోపలికి పంపుతున్నారని, వందల సంఖ్యలో ప్రజలు బయట ఉండాల్సిన పరిస్థితి ఉందని సామాన్యులు మండి పడుతున్నారు. ఎన్నికల ముందు ఏవేవో చెప్పి అధికారంలోకి వచ్చిన వారి అసలు రంగు ఇప్పుడిప్పుడే బయట పడుతుందని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ప్రజాదర్బార్ అంతా పబ్లిసిటీ కోసమేనా.. ప్రజల కోసం కదా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. మరి ప్రజల ఆగ్రహతీరుపై కాంగ్రెస్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read:పిక్ టాక్ : తమన్నా అందాల అరాచకం