ప్రభాస్ ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్న’సలార్’?

48
- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” సలార్ “. ఈ మూవీ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ ఖాతాలో ఆ రేంజ్ హిట్స్ ఒక్కటి కూడా పడలేదు. ఆ తరువాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ ఇలా ప్రతి సినిమా కూడా డార్లింగ్ అభిమానులను గట్టిగానే నిరాశ పరిచాయి. దాంతో తమ హీరో కటౌట్ ను సరిగ్గా వాడుకునే డైరెక్టర్ ప్రశాంత్ నీలే అని ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. .

అభిమానులు పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం డిస్సపాయింట్ చేయని విధంగా ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ ను ఊర మాస్ గా సలార్ మూవీలో చూపించబోతున్నాడని ఇటీవల విడుదల అయిన టీజర్ తో అర్థమైపోయింది. టీజర్ లో ప్రభాస్ మొఖం కనిపించకుండానే ఊర మాస్ ఎలివేషన్స్ ఇచ్చి ఫ్యాన్స్ కు పిచ్చెకించాడు ప్రశాంత్ నీల్. దీంతో మూవీపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ను ఒక్క విషయం మాత్రం కలవర పెడుతోందట. ఈ మూవీ కే‌జి‌ఎఫ్ ను పోలి ఉంటే సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే కే‌జి‌ఎఫ్ రెఫరెన్స్ తోనే వచ్చిన కబ్జా ఎంతటి డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

Also Read:మళ్ళీ ఎన్డీయే లోకి టీడీపీ..?

అందువల్ల సలార్ లో కూడా కే‌జి‌ఎఫ్ ఛాయలు కనిపిస్తే కమాన్ ఆడియన్స్ డిస్సపాయింట్ అవ్వడం గ్యారెంటీ అనే అభిప్రాయాలు కొందరిలో ఉన్నాయి. అయితే సలార్ మూవీకి మరియు కే‌జి‌ఎఫ్ సిరీస్ కు ఇంటర్నల్ లింక్ ఉందనే వార్తలు వస్తున్నాయి. దీంతో కచ్చితంగా కే‌జి‌ఎఫ్ ఛాయలు సలార్ లో కనిపించే అవకాశం ఉంది. అయితే కే‌జి‌ఎఫ్ తో సలార్ లింక్ చేస్తూ ఒక కొత్త అనుభూతిని ఇస్తే పరవాలేదు గాని.. అలా కాకుండా మూవీలో కే‌జి‌ఎఫ్ ఫ్లెవర్ ఎక్కువగా కనిపిస్తే ప్రభాస్ మరో ఫ్లాప్ మూటగట్టుకోవడం ఖాయమని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరి ప్రశాంత్ నీల్ సలార్ మూవీని ఎలా రూపొందించాడో తెలియాలంటే సెప్టెంబర్ 28 వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read:చింతచిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

- Advertisement -