Prabhas:ప్రభాస్ ఫ్యాన్స్ వైసీపీకి మద్దతు?

34
- Advertisement -

ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వైసీపీకి మద్దతు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ నాయకులు కూడా ఇదే అంచనా వేస్తున్నారు. ఇందుకు కారణం … ఎన్నికల్లో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే వార్తలు రావడమే. జగన్ మోహన్ రెడ్డి ఆమెకు టిక్కెట్ ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ వైసీపీకి మద్దతు ఇస్తారని అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికలు అత్యంత కీలకమైనవి.

ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్దుల పైన స్పష్టత ఇచ్చారు జగన్. వైసీపీ నుంచి కొందరు నేతలు టీడీపీ పార్టీలోకి వెళ్తున్న వేళ ముఖ్యమైన సీట్ల విషయం లో జగన్ రెడ్డి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా జిల్లాలో సీట్ల విషయంలో అనేక మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కొత్త అభ్యర్ది అయిన శ్యామలా దేవికి జగన్ టికెట్ ఖరారు చేస్తారా ? అనే డౌట్ ఉన్నా.. శ్యామలా దేవి మాత్రం జగన్ పార్టీ వైపే మొగ్గు చూపుతుంది.

నిజానికి దివంగత సినీ హీరో కృష్ణంరాజు బీజేపీ అభ్యర్దిగా పోటీ చేసి గెలిచారు. పైగా గతంలో బీజేపీలో కృష్ణంరాజు క్రియాశీలకంగా పని చేశారు కూడా. ఆ రకంగా కృష్ణంరాజు భార్యగా శ్యామలా దేవి ఎప్పటి నుంచో రాజ‌కీయాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే శ్యామలా దేవికు ప్రత్యక్ష రాజకీయాలపై బాగా ఆసక్తి ఉందని అంటుంటారు. మొత్తానికి 2024 ఎన్నిక‌ల‌కు ముందు శ్యామలా దేవి వైసీపీలో జాయిన్ అయ్యారు. మరి వచ్చే ఎన్నిక‌ల్లో శ్యామలా దేవి ఏ రేంజ్ లో రాణిస్తారో చూడాలి.

Also Read:లేట్ ప్రెగ్నెన్సీ లాభామా ? నష్టమా ?

- Advertisement -