Pawan:పవన్ ‘అపరిచిత’ వ్యూహాలు!

25
- Advertisement -

అపరిచితుడు అనగానే మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న ఒక సినీ క్యారెక్టర్ వెంటనే మన మైండ్ లో అలా ఫ్లాష్ అవుతుంది. ఆ మూవీలో ఒకే వ్యక్తి రకరకాలుగా ప్రవర్తించడం చూస్తాం. అయితే ఇది రాజకీయాల్లో సాధ్యమేనా అంటే ముమ్మాటికి సాధ్యమే అంటున్నారు కొందరు రాజకీయ వాదులు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను రాజకీయ అపరిచితుడిగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు, రాజకీయంగా ఆయన వేస్తున్న ఎత్తుగడలు అలాగే ఉన్నాయనేది కొందరి వాదన. ఏపీలో వైసీపీని గద్దె దించడమే లక్ష్యమని చెబుతూ వస్తున్న పవన్ అందుకోసం టీడీపీతో దోస్తీ కట్టారు.

అయితే టీడీపీ తో సంబంధం లేదు అంటున్న బీజేపీతో ఆయన మొదటి నుంచి పొత్తులో ఉన్నారు. కానీ తాము ఎన్డీయే మిత్రపక్షం అని చెబుతున్నా పవన్ ఏపీ బీజేపీతో మాత్రం ఇంతవరకు కలిసి ఎలాంటి అధికారిక కార్యక్రమాలు చేపట్టలేదు. కలిసి ఎలాంటి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయలేదు. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేస్తుందని చెప్పిన పవన్.. మొదట 32 స్థానాల్లో బరిలోకి దిగుతుందని చెప్పుకొచ్చారు.

Also Read:‘హాయ్ నాన్న’..కావాల్సిన ప్రేమ దొరుకుతుంది

కానీ ఇప్పుడేమో బీజేపీ కేటాయించిన సీట్లలో మాత్రమే పోటీ చేసేలా అడుగులు వేస్తున్నారు. ఇక ఒకదానికొకటి పొంతనలేని ప్రణాళికలతో పవన్ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇంతకీ పవన్ రాజకీయంగా తన ఎజెండా ఎంతో ప్రజలకు తెలియజేయడం మానేసి.. తన ఇష్టానుసారంగా ఒకచోట ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం.. మరోచోట అదే పార్టీకి దూరంగా ఉండడం, ఇంకా పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం.. ఇలా అస్థిర వ్యూహాలతో పవన్ వ్యవహరిస్తుండడంతో ఆయనపై ప్రజల్లో కూడా అస్థిర అభిప్రాయం ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read:ప్రతిరోజూ శనగలు తింటే ఎన్ని లాభాలో!

- Advertisement -