కాంగ్రెస్ ‘స్కాం’ లండోయ్.. జర భద్రం!

38
- Advertisement -

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ 75 ఏళ్లలో దాదాపు 60 ఏళ్ళు కాంగ్రెస్ పాలన కొనసాగింది. ఈ అరవై ఏళ్లలో ఆ పార్టీ నేతలు చేసిన కుంభకోణాలు, భూ కబ్జాలు, అక్రమాలు.. ఇలా ఎన్నో. అధికార ముసుగులో దేశాన్ని సర్వం దోచేసిన ఘనత బహుశా హస్తం పార్టీకే లభిస్తుందేమో. గ్యారెంటీ లేని హామీలను ఎన్నో ప్రకటిస్తూ ప్రజలను మభ్యపెడుతూ కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన హస్తం పార్టీ అక్రమాలను గుర్తించిన ప్రజలు 2014లో పాతాళానికి నెట్టేశారు. ఆరు దశాబ్దాల పాలనలో దేశాన్ని అధోగతి పాలు చేసి అభివృద్దికి నోచుకోని దేశంగా మార్చి, ఇండియా అంటేనే స్కామ్ లు అని ప్రపంచ దేశాల ఎదుట దోషిగా నిలిపిన దౌర్భాగ్య ఘనత ఒక్క కాంగ్రెస్ కే దక్కుతుంది.

ఆ పార్టీలోని సామాన్య నేతలు మొదలుకొని పార్టీ అగ్రనేతల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్కామ్ లో డిగ్రీ పట్టా పొందిన వారే. రాహుల్ గాంధీ – నేషనల్ హెరాల్డ్ స్కామ్, సోనియా గాంధీ – నేషనల్ హెరాల్డ్ స్కామ్, చాపర్ స్కామ్, మల్లికార్జున్ ఖర్గే – నేషనల్ హెరాల్డ్ స్కామ్, జై రామ్ – కోల్ స్కామ్, ఇక తెలంగాణ విషయానికొస్తే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు స్కామ్.. అబ్బో ఇలా హస్తం నేతలు చేసిన స్కామ్ లు అన్నీ ఇన్నీ కావు. మొత్తంగా స్కామ్ లతో నిండిన కాంగ్రెస్ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధోచుకోవడం కోసమే అధికారం అన్న రీతిలో సాగే హస్తం నేతల తీరు.. దేశ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియందేమీ కాదు. అధికారం కోసం మొసలి కన్నీరు కారుస్తూ ఎన్ని జిమ్మిక్కులు చేసిన కాంగ్రెస్ ప్రయత్నాలను హస్తగతం చేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది జగమెరిగిన సత్యం.

Also Read:‘హాయ్ నాన్న’..కావాల్సిన ప్రేమ దొరుకుతుంది

- Advertisement -