తెలంగాణ ఫలితాలు పవన్ లో కలవరాన్ని పెంచాయా ? అందుకే ఆయన దిక్కు తోచని స్థితిలో ఉన్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పార్టీ స్థాపించిన తరువాత పవన్ పూర్తిగా ఏపీపైనే దృష్టి సారిస్తూ వచ్చారు. ప్రజల్లో కూడా జనసేన పార్టీ ఏపీకి సంబంధించినది మాత్రమే అనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. కానీ ఏపీలో ఇంతవరకు జనసేన పూర్తి స్థాయిలో ప్రభావం చూపలేదు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికి 2019లో కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. పార్టీ అధినేత పవన్ కూడా ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూడదతో జనసేన పార్టీని అందరూ కూడా లైట్ తీసుకుంటూ వచ్చారు. కానీ గత కొన్నాళ్లుగా ఏపీలో జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడుతూ వచ్చింది. .
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ధీటైన ప్రత్యర్థిగా జనసేనపార్టీనే అనే అభిప్రాయాన్ని కూడా ఏర్పరచుకుంది. కానీ ఇంతలోనే టీడీపీ తో జట్టు కట్టడం అలాగే బీజేపీతో కూడా దోస్తీని కొనసాగించడం వంటి పరిణామాలతో ప్రజలను మళ్ళీ గందరగోళానికి గురిచేశారు పవన్. ఇదే సమయంలో పవన్ ప్యాకేజీ కోసమే రెండు పార్టీలతో పొత్తు కొనసాగిస్తున్నారని, ఓయనొక ప్యాకేజీ స్టార్ అని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండడంతో ఈ విమర్శలు ప్రజల్లోకి బలంగానే వెళుతున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి ప్రజలు పవన్ ను లైట్ తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తమౌతున్నవేళ తెలంగాణ ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చి ఘోరంగా దెబ్బ తిన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసిన పవన్ కు ఎక్కడ కూడా కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. దీంతో ఈ ఘోర పరాభవం ఏపీలో ఎలా ప్రభావం చూపనుందనే భయం పవన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సిఎం పదవి విషయంలో పవన్ కొంత వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు టీడీపీ జనసేన కూటమిలో తమదే పై చేయి అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చిన పవన్.. ఇప్పుడేమో ఎక్కువ సీట్లు సాధిస్తేనే సిఎం పదవి అడగడానికి వీలుంటుందని చెబుతున్నారు. దీంతో పవన్ అధికారం కోసం ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి ? టీడీపీ, బీజేపీ లతో పొత్తు కొనసాగించాలా ? లేదా ఏదో ఒక పార్టీతోనే జట్టు కట్టడం మచిదా ? అనే సందేహాలు పవన్ ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణ ఎన్నికల ఫలితాలతో పవన్ కు దిక్కు తోచడం లేదనేది ఇంటర్నల్ గా వినిపిస్తున్న మాట.
Also Read:రెండో పెళ్లి వార్తల పై నగ్మా సీరియస్