బొప్పాయి తింటే గర్భం పోతుందా?

43
- Advertisement -

గర్భిణీలు బొప్పాయి తింటే గర్భం పోతుందని భయపడుతుంటారు. పెద్దలు కూడా ఇదే విషయాన్ని చెబుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు బొప్పాయ్ తినరాదని తింటే ప్రమాదామని చెబుతుంటారు. అయితే ఇందులో ఎంతవరుకు నిజం ఉందనేదానిపై మాత్రం చాలమందికి అవగాహన ఉండదు. ఇంతకీ గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినడంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు ? నిజంగా బొప్పాయి ప్రమాదమేనా అనే విషయాలను తెలుసుకుందాం !

నిజానికి బొప్పాయిలో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, బి, సి, ఇ, వంటి వాటితో పాటు ఫ్లేవనాయిడ్లు, ఫోలెట్ లు, పీచు పదార్థం వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయిలో లభించే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు, రక్త వృద్దిని కూడా పెంచుతుంది. బొప్పాయి తినడం వల్ల లివర్ సమస్యలు, గ్యాస్టిక్ సమస్యలు, అసిడిటీ, వంటి సమస్యలు దురమౌతాయి. మధుమేహం ఉన్నవారికి బొప్పాయి ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా టైపు 2 డయాబెటిస్ తో బాధపడే వారు తప్పనిసరిగా ప్రతిరోజూ బొప్పాయి తినాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:ఈ ఫుడ్స్‌తో ఈజీగా బరువు తగ్గండి!

ఇంకా వివిధ రకాల కంటి సమస్యలను దూరం చేయడంలో బొప్పాయి ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇంకా జీర్ణ శక్తిని మెరుగు పరచడంలోనూ, కీళ్ల నొప్పులను దూరం చేయడంలోనూ ఈ పండు ఎంతో ప్రయోజనకారి. అయితే ఇన్ని ప్రయోజనలు ఉన్నప్పటికి గర్భిణీ స్త్రీలు బొప్పాయి విషయంలో జాగ్రత్త వహించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాగా పండిన బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేనప్పటికి కొద్దిగా పచ్చిగా ఆకుపచ్చగా ఉన్న బొప్పాయి లను తింటే గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని నిపుణులే చెబుతున్నారు. ఎందుకంటే పచ్చి బొప్పాయిలో లెటక్స్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుందట. దీని వల్ల గర్భిణీస్త్రీలకు గర్భ స్రావం జరిగే ప్రమాదం ఉందట. కాబట్టి బొప్పాయిని ఎట్టి పరిస్థితుల్లో గర్భం దార్చిన వారు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:IND VS WI 3rd ODI:సిరీస్ భారత్‌దే

- Advertisement -