స్మృతి మంధాన–పలాష్ పెళ్లి బ్రేక్!

4
- Advertisement -

పలాష్ ముచ్చల్‌ స్మృతి మంధానను మోసం చేశాడా?…వెడ్డింగ్ వాయిదా తర్వాత ఓ మహిళతో పలాష్ ముచ్చల్ చేసిన చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాలక్ ముచ్చల్, పలాష్–స్మృతి మంధానల వివాహాన్ని కుటుంబాలు వాయిదా వేసుకున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే, ఆ గాయని-దర్శకుడి చాట్ స్క్రీన్‌షాట్లు రెడిట్‌లో వైరల్ అయ్యాయి.

ఆ సందేశాల్లో అతను ఆ మహిళను ప్రశంసిస్తూ ఫ్లర్ట్ చేసినట్లు కనిపించింది. ఆమెను తనతో కలిసి స్విమ్మింగ్‌కు రావాలని, తరువాత స్పాకు రావాలని, ఆ తర్వాత తెల్లవారుజామున 5 గంటల సమయంలో ముంబై వెర్సోవా బీచ్‌కు రావాలని సూచించాడు. ఇది స్మృతి తండ్రి ఆసుపత్రిలో చేరినట్లు వచ్చిన వార్తల తర్వాత జరిగింది. సోమవారం పలాష్ కూడా ఆసుపత్రిలో చేరినట్లు కొన్ని రిపోర్టులు పేర్కొన్నాయి.

మేరీ డికోస్టా అనే మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆ స్క్రీన్‌షాట్లను పోస్ట్ చేసింది. ఆమెతో చాట్ చేస్తూ పలాష్ స్మృతితో తన ‘లాంగ్-డిస్టెన్స్’ రిలేషన్‌షిప్ గురించి, ఆమెతో టూర్లకు వెళ్లే విషయాలు గురించి చెప్పాడు. అతని సందేశాల్లో, ఆమె అందాన్ని ప్రశంసిస్తూ ఫ్లర్ట్ చేసినట్లు కనిపించింది. స్విమ్‌కు రావాలని, తర్వాత స్పాకు రావాలని, ఆ తర్వాత తెల్లవారుజామున 5 గంటలకు ముంబై వెర్సోవా బీచ్‌కు రావాలని అతను సూచించాడు. ఆ మహిళ “అయితే నువ్వు ఆమెను (స్మృతిని) ప్రేమిస్తావా?” అని అడిగినప్పుడు పలాష్ సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నాడు. అయితే ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌ రావాల్సి ఉండగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాట్‌కు సంబంధించింది వాస్తవమా కాదా అన్నది తెలియాల్సి ఉంది.

Also Read:అయోధ్యలో ప్రధాని మోదీ రోడ్‌షో

- Advertisement -