ఎన్సీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందా..?

33
- Advertisement -

ఇటీవల మహారాష్ట్ర రాజకీయాలు ఎంతటి హాట్ టాపిక్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. ఎన్సీపీలోని కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ అనూహ్యంగా ఆ పార్టీ నుంచి 29 మంది ఎమ్మెల్యేలతో షిండే వర్గంలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్సీపీ రెండుగా చీలి బలహీన పడింది. ప్రస్తుతం శరత్ పవార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఎన్సీపీ ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది. పార్టీలో చీలిక తెచ్చిన వారిని వదిలిపెట్టబోమంటూ చెబుతున్నా శరత్ పవార్ కు.. ఇప్పుడు పార్టీని కాపాడుకోవడమే ప్రధమ కర్తవ్యంగా మారింది. ఉన్న కొద్ది మంది ఎమ్మేల్యేలు కూడా పక్కా చూపులు చూస్తే మహారాష్ట్రలో ఎన్సీపీ పనైపోయినట్లేనని విశ్లేషకులు చెబుతున్నా మాట. .

ఈ నేపథ్యంలో ఎన్సీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ఎలా ఉంటుందనే దానిపై శరత్ పవార్ ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం మహారాష్ట్రలో ఇతర పార్టీలలో చీలిక తెచ్చి బలపడుతున్న బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తో చేతులు కలపడమే ఉత్తమం అని శరత్ పవార్ భావిస్తున్నారట. కాగా గతంలో శరత్ పవార్ కాంగ్రెస్ కు మద్దతు గా నిలిచి అనూహ్యంగా మళ్ళీ తన మద్దతును విరమించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తో కలవడం తప్పా ఎన్సీపీకి వేరే దారి లేదు. అయితే ఈసారి కేవలం మద్దతు కాకుండా ఏకంగా పార్టీనే విలీనం చేయాలని కాంగ్రెస్ కండిషన్ పెట్టినట్లు నేషనల్ మీడియాలో కొడై కుస్తోంది. దీనికి శరత్ పవార్ కూడా సుముఖంగానే ఉన్నాడట. అయితే విలీనం పై ప్రస్తుతం ఎన్సీపీలో ఉన్న నేతలు ఎంతవరకు స్వాగతిస్తారో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ నిజంగానే విలీనం జరిగితే కాంగ్రెస్ కు మహారాష్ట్రలో బలం పెరిగే అవకాశం ఉంది. మరి రోజుకో మలుపు తిరుగుతున్న మహారాష్ట్ర పాలిటిక్స్ లో తరువాతి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

Also Read:చింతచిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

- Advertisement -