Modi:మోడీ కులాలను వాడుకుంటున్నారా?

60
- Advertisement -

ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్శించేందుకు హామీలు గుప్పించడం ఆ తరువాత వాటిని పక్కన పెట్టేయడం.. బీజేపీకి పరిపాటిగా మారింది. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల వేళ ప్రజలను ఆకర్శించేందుకు కులాల ముసుగులో రాజకీయ లబ్దికోసం పాకులాడుతున్నారు కమలనాథులు. రాష్ట్రంలో పార్టీ బలం ఏ మాత్రం లేదనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే కుల ప్రతిపాధికన హామీలను గుప్పిస్తూ రాజకీయ చర్చకు తావిస్తోంది కమలం పార్టీ. నిన్న వరకు బీసీవర్గాన్ని ఆకాశానికెత్తిన బీజేపీ నేతలు ఇప్పుడు దళిత వర్గంపై దృష్టి పెడుతూ వ్యూహాలను అమలు చేసే పనిలో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సి‌ఎం చేస్తామని కాషాయ పార్టీ పెద్దలు చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదనే సంగతి తెలియంది కాదు. అందుకే జరగని ఫలితానికి ఎలాంటి హామీలు గుప్పించిన ప్రజలు పట్టించుకోరనే ఉద్దేశంతోనే బీజేపీ ఇతర రాజకీయానికి తెర తీసిందనేది కొందరి వాదన. ఇక తాజాగా మరోసారి తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ అయ్యారు. దశాబ్దాలుగా నాలుగుతున్న ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేస్తామని చెబుతూ ఎస్సీ ఓటర్లకు గాలం వేసే వ్యూహానికి శ్రీకారం చుట్టారు. అయితే నిజంగా చిత్తశుద్ది ఉంటే ఎస్సీ వర్గీకరణపై ఎప్పుడు కమిటీ వెయ్యాల్సిన మాట. కానీ సరిగ్గా ఎన్నికల ముందు ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఇవి ఎలక్షన్ స్టంట్స్ మాత్రమే అని ప్రజలు కొట్టి వేసే పరిస్థితి. రాష్ట్రంలో పాతాళానికి పడిపోయిన బీజేపీని తిరిగి లేపేందుకే కులాలను అడ్డు పెట్టుకొని బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని కొందరు విశ్లేషకులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి కులాల ముసుగులో బీజేపీ వ్య్ఫుహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Also Read:దీపావళి హారతులు ఎందుకు ఇవ్వాలి?

- Advertisement -