మోడీ క్లారిటీ ఇచ్చారా ? కన్ఫ్యూజన్ లోకి నెట్టారా ?

23
- Advertisement -

ప్రస్తుతం టైమ్ కానీ టైమ్ లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా సంగతి తెలిసిందే. అసలు ఈ పార్లమెంట్ సమావేశాలు ఎందుకు జరుగున్నాయి ? ఇప్పటికిప్పుడు ఈ ప్రత్యేక సమావేశాలు జరపడానికి గల కారణాలెంటి ? ఇంతకీ ఏజండా ఏంటి ? ఇలాంటి ప్రతిఒక్కరిలోనూ మెదులుతున్నాయి. ఎందుకంటే ఈ సమావేశాలు జరపడానికి గల అసలు కారణాలను మోడీ ప్రభుత్వం ఇంతవరకు బహిర్గతం చేయలేదు. జమిలి ఎలక్షన్స్ ప్రవేశ పెట్టడానికని, దేశం పేరు మార్చడానికి అని, ముందస్తు ఎన్నికల కోసమని ఇలా రకరలాల వార్తలు అయితే వీటిలో దేనిపై కూడా మోడీ సర్కార్ క్లారిటీ ఇవ్వలేదు. పైగా ఎవరు ఊహించని విధంగా మహిళా బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. .

దీంతో మహిళా బిల్లు కోసమే ఈ సమావేశాలా అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు. అయితే జమిలి ఎలక్షన్స్ విషయంలో ఇప్పటికే మోడీ సర్కార్ ఇప్పటికే ఓ కమిటీని కూడా వేసిన సంగతి తెలిసిందే. అటు జి20 సదస్సులో భాగంగా ఇండియా పేరును మార్చి భారత్ గా ప్రభుత్వ గెజిట్ పత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో జమిలి ఎలక్షన్స్ బిల్లు, దేశ పేరు మార్పు కు సంబంధించిన బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడం గ్యారెంటీ అని భావించారంతా కానీ మహిళా బిల్లు మాత్రమే ఇప్పుడు పార్లమెంట్ లో ఆమోదం పొండడానికి రెడీగా ఉంది. మరి జమిలి ఎలక్షన్స్ , దేశ పేరు మార్పు అంశం ఏమైనట్టు అనే డౌట్స్ వ్యక్తమౌతున్నాయి.

మరోవైపు జమిలి ఎన్నికలు జరపల్సి వస్తే లోక్ సభ ముందస్తు ఎన్నికలు రావడం గ్యారెంటీ అని భావించారంతా. కానీ పార్లమెంట్ లో మోడీ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అసలు ఎలక్షన్స్ ఇప్పట్లో లేవు అన్నట్లుగానే వ్యాఖ్యానించారాయన. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, పార్లమెంట్ రద్దు కావడానికి సమయం మిగిలిఉందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో పరోక్షంగా ఎన్నికలు ఇప్పట్లో లేవని హింట్ ఇచ్చారా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కొందరు. అటు కొత్త పార్లమెంట్ భవనానికి ” హౌస్ ఆఫ్ ఇండియా ” గానే నామకరణం చేశారు. దీంతో భారత్ గా పేరు మార్చడాన్ని మోడీ సర్కార్ విరమించుకుందా ? అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. మొత్తానికి పార్లమెంట్ సమావేశాల వెనుక అసలు కారణాలు బహిర్గతం చేయకుండా ప్రధాని మోడీ కన్ఫ్యూజ్ చేస్తున్నారనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.

Also Read:నూడుల్స్ తింటున్నారా.. జాగ్రత్త !

- Advertisement -