మోడీ మోనార్క్ లా వ్యవహరిస్తున్నారా ?

62
- Advertisement -

దేశంలో మోడీ మోనార్క్ లా వ్యవహరిస్తున్నారా ? ప్రస్తుతం జరుగుతున్నా పరిణామాలు మోడీ నియంత పాలనకు నిదర్శనమా ? మోడీ సర్కార్ ను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదా ? లాంటి ప్రశ్నలు తాజా పరిణామాలను గమనించే వారికి కలుగక మానవు. ఎందుకంటే దేశంలో మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అలాగే ఉందిమరి..! దేశంలో ఏ పార్టీకి ఇవ్వనంత మెజారిటీని కట్టబెట్టి బీజేపీకి అధికారాన్ని ఇచ్చారు దేశ ప్రజలు. ఇదంతా కూడా ఒక్క మోడీ మేనియా వల్లే సాధ్యమైందని చెప్పక తప్పదు. 2014 మరియు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తిరుగులేని ఆధిక్యం కనబరిచిందంటే కేవలం నరేంద్ర మోడీ వల్లే.

మరి ఇంతటి ప్రజాదరణ పొందిన మోడీ ప్రధాని అయిన తరువాత.. దేశాన్ని ఎంతమేర అభివృద్ది పథంలో నడిపించారు అంటే జవాబు చెప్పలేని పరిస్థితి. మోడీ ప్రధాని తరువాత దేశం ఎంతో పురోగతి సాధించిందని బీజేపీ గొప్పలు చెబుతున్నప్పటికి అవన్నీ ఒట్టి నోటి మాటలే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రపంచ ఇండెక్స్ లలో భారత్ 2014 తో పోలిస్తే అన్నీ రంగాల్లోనూ దిగజారుతు వస్తోందని ఆయా సూచికలు చెబుతున్నాయి. మరి మోడీ సాధించింది ఏమిటి అంటే.. ఆయన పాలనను ప్రశ్నించిన వారినిపై కక్ష పూరితంగా వ్యవహరించడం, ఆయనను వేలెత్తి చూపితే కేసులు పెట్టడం, ఆయన పాలనకు ఎదురే లేదన్నట్లుగా వ్యవహరించడం ఇదే ప్రధాని మోడీ తిరులా కనిపిస్తోంది.

ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా ఇదే విషయాలను స్పష్టం చేస్తున్నాయి. ఆ మద్య కాంగ్రెస్ నేతలపై జరిగిన నేషనల్ హెరాల్డ్ కుంబకోణం, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన లిక్కర్ స్కామ్ వంటి ఎన్నో మనీ లాండరింగ్ కేసులను ప్రతిపక్ష పార్టీ నేతలపై మోపుతూ వల్ల గొంతు నోక్కే ప్రయత్నం చేస్తోంది మోడీ సర్కార్. ఇక ఇప్పుడు మోడీ నిరంకుశ పాలనకు చెక్ పెట్టేందుకు దేశంలో విస్తరిస్తున్న బి‌ఆర్‌ఎస్ ను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా అన్నీ అస్త్రాలను సిద్దం చేస్తోంది మోడీ సర్కార్. ఇప్పటికే డిల్లీ లిక్కర్ స్కామ్ మరకను బి‌ఆర్‌ఎస్ నేతలకు అంటించే ప్రయత్నం చేస్తోంది. దేశంలో బి‌ఆర్‌ఎస్ బలపడుతున్న నేపథ్యంలో బలహీన పరిచేందుకు బీజేపీ అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంతటి మోనార్క్ ల వ్యవహరిస్తున్న మోడీ పాలనకు వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలు గట్టిగానే బుద్ది చెప్పే అవకాశం ఉందని కొందరి రాజకీయ వాదుల అభిప్రాయం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -