ఆ నటి మళ్లీ పెళ్లి.. నిజమేనా ?

28
- Advertisement -

సీనియర్ హీరోయిన్ మీనా భర్తను కోల్పోయి ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. అయితే, ఒంటరి తనంతో మీనా చాలా ఇబ్బంది పడుతుందని.. అందుకే మీనా మళ్లీ పెళ్లిపై ఆసక్తి చూపిస్తోంది అని వార్తలు వస్తున్నాయి. ఈ పుకార్లు కొత్తేంకాదు. ఓ తమిళ నిర్మాత – మీనా పెళ్లి చేసుకుంటున్నారనే రూమర్ కూడా కొత్తకాదు. కాకపోతే కోలీవుడ్ మీడియాలో ఇది మరోసారి వైరల్ అయింది. ఈసారి ఇటు మీనా, అటు మీనా ఫ్యామిలీ రియాక్ట్ అయ్యారు. దయచేసి ఇలాంటి పుకార్లు పుట్టించొద్దు అని మీనా సన్నిహితులు తెలిపారు.

మీనా రెండో పెళ్లిపై ఆమె సన్నిహితులు ఏం మాట్లాడారు అంటే.. ‘అవును, మీనాను రెండోపెళ్లి చేసుకోమని ఎంతో మంది చెప్తున్నారు. కానీ ఎవరికీ తెలుసు ?, ఆమె భర్త మరణం ఆమెను మానసికంగా కుంగదీసింది. అలా అని జీవితాంతం అలాగే ఉండాలంటే కుదరదు. మీనాకి ఇప్పుడిప్పుడే అన్ని అర్థం అవుతున్నాయి. ఒక్కటి మాత్రం నిజం తన కుమార్తె కోసమే ఆమె జీవిస్తుంది. ప్రస్తుతానికి అయితే రెండో పెళ్లి గురించి ఆలోచించే స్థితిలో మీనా లేదని వారు క్లారిటీ ఇచ్చారు. కాకపోతే.. కచ్చితంగా మీనా మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు అని సన్నిహితులు ఇన్ డైరెక్ట్ గా చెప్పారు.

ఐతే, మీనాతో ఓ నిర్మాత చాలా సన్నిహితంగా ఉంటున్నాడు అని, అతన్నే మీనా పెళ్లాడబోతుంది అని, అతడు ఆమెకు మంచి స్నేహితుడు అని టాక్. కానీ, గత ఏడాది విడాకులు తీసుకున్న ఓ హీరోతో కూడా మీనా చాలా సన్నిహితంగా ఉంటుందని.. ఆ హీరోతో మీనా డేటింగ్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ న్యూస్ ను ఆ మధ్య మీనా ఖండించింది. కానీ, ఆ తర్వాత కూడా మీనా అతనితో ఓ రీస్టార్ట్ లో కనిపించింది. మరి మీనా రెండో పెళ్లి త్వరలోనే ఉంటుందేమో చూడాలి.

Also Read:మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలు..!

- Advertisement -