లోక్ సభ ఎలక్షన్స్.. ముందస్తుగానే ?

61
- Advertisement -

ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అందరి దృష్టి లోక్ సభ ఎన్నికలపై పడింది. ప్రస్తుత లోక్ సభ గడువు వచ్చే ఏడాది జూన్ 16 తో ముగుస్తుండటంతో లోక్ సభ ఎలక్షన్స్ ఎప్పుడనే చర్చ జరుగుతోంది. సాధారణంగా ఏప్రెల్ లేదా మే లో పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అంతకంటే ముందుగానే ఎన్నికలు నిర్వహించేదుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుందనే చర్చ జాతీయ రాజకీయాల్లో జరుగుతోంది. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి మార్చి లేదా ఏప్రెల్ లో ఎలక్షన్స్ ముగించే ఆలోచనలో ఉన్నట్లు టాక్. అందుకే ఆయా రాష్ట్రాలలో బీజేపీ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. బీజేపీ దూకుడు చూసి ప్రత్యర్థి పార్టీలు సైతం ప్రచారలపై దృష్టి సారిస్తున్నాయి. .

ముఖ్యంగా కాంగ్రెస్ తో పాటు ఇతరత్రా పార్టీలు నార్త్ మరియు సౌత్ లో ప్రచార షెడ్యూల్ ను సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్. ఇక సౌత్ విషయానికొస్తే ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికి లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటలని బి‌ఆర్‌ఎస్ భావిస్తోంది. కేవలం రెండు శాతం ఓటు తేడాతో ఓటమి పాలు అయిన బి‌ఆర్‌ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం అన్ని స్థానాల్లో విజయంపై ఫోకస్ చేస్తోంది. అటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా లోక్ సభ ఎలక్షన్స్ కోసం వ్యూహాలను రెడీ చేసుకుంటున్నాయి. ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడంతో అక్కడి రాజకీయాలు మరింత రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. మరి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లోక్ సభ ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

Also Read:‘దేవర’లో హైలైట్ ఎపిసోడ్ అదే

- Advertisement -