బీజేపీలో ఉండలేకపోతున్నారా?

47
- Advertisement -

రోజురోజుకూ పెరుగుతున్న బీజేపీ నియంత పోకడలు ఆ పార్టీకి చెందిన నేతలు సైతం సహించలేకపోతున్నారు. తాము చెప్పిందే శాసనం, చేసిందే చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్న కమలం పెద్దల వైఖరిపై సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యమా లేక బీజేపీ రాజ్యమా అనే సందేహం రాక మానదు. ఈమద్య కాలంలో మోడీ సర్కార్ తీసుకుంటున్న ఎన్నో నిర్ణయాలు పై అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయి. పార్టీ వేరు ప్రభుత్వం వేరు.. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీ లభ్ది కోసం వాడుకుంటున్నారు బీజేపీ పెద్దలు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆ మద్య మణిపూర్ అల్లర్ల విషయంలో బిజెపి సర్కార్ వ్యవహరించిన తీరుతో పలువురు సొంత పార్టీ నేతలు బీజేపీని విడారు.

ఇక తాజాగా జమిలి ఎలక్షన్ విధానం, దేశ పేరుమార్పు వంటి అంశాలతో మరోసారి బీజేపీ సర్కార్ దేశ ప్రజల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఇప్పటికే ఈ అంశాలపై కసరత్తులు కూడా చేస్తోంది. అయితే అటు జమిలి ఎలక్షన్స్ గాని దేశ పేరు మార్పు గాని అంతా ఈజీ అయిన విషయం కాదు. దాంతో ప్రతిపక్షాలు కూడా బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఈ ప్రతికూలతలన్నీ పార్టీకి ముప్పుగా మారుతున్నాయి.పార్టీలోని కీలక నేతలంతా ఒక్కొక్కరు గా బీజేపీ కి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు చంద్ర కుమార్ బోస్ బీజేపీకి రాజీనామా చేశారు.

ప్రస్తుతం బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరు తనకు నచ్చడం లేదని, బెంగాల్ రాష్ట్రం విషయంలో ఎన్నో ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచినప్పటికి వాటిని పెట్టించుకోవడం లేదని అందుకే పార్టీని విడుతున్నట్లు చంద్రకుమార్ బోస్ చెప్పుకొచ్చారు. కాగా ప్రస్తుతం రాష్ట్రాల అభివృద్దిని పక్కన పెట్టి రాష్ట్రాలను నిర్వీర్యం చేసేలా కేంద్ర పెద్దలు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఎన్నికల ముందు బీజేపీని వీడే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తాజా పరిణామాలతో స్పష్టమౌతోంది.

Also Read;పఠాన్‌ని మించిన గదర్ 2!

- Advertisement -