ఆర్సీబీకి కోహ్లీ గుడ్ బై ?

58
- Advertisement -

ఈ సీజన్ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యంత దారుణంగా విఫలం అవుతోంది. వరుస ఓటముల పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. గత సీజన్లతో పోల్చితే పాయింట్ల పట్టికలో ఆర్సీబీ చిట్టచివరి స్థానంలో ఉండడం ఇదే మొదటి సారి. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒకే ఒక్క విజయం సాధించి అయిదింట్లో ఓటమి చవిచూసింది. ఇక మరో రెండు మ్యాచ్ లు ఓడిపోతే ఆర్సీబీకి ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు లేనట్లే. ఇఇక ముందు రోజుల్లో మరో చెన్నై సూపర్ కింగ్స్, హైదరబాద్ సన్ రైజర్స్ వంటి జట్లతో మ్యాచ్ ఉండడంతో ఆర్సీబీకి గట్టి పరిక్షే ఎదురు కానుంది. .

చెన్నై, హైదరబాద్ జట్లు ఈ సీజన్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నాయి. మరి ముఖ్యంగా హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు గతంలో ఎప్పుడు లేనంతా ఫామ్ లో ఉండడంతో ఈ జట్టును ఎదుర్కోవడం ఆర్సీబీకి అంతా సులువైన విషయం కాదు. పైగా జట్టులో కోహ్లీ మినహా మిగిలిన బ్యాట్స్ మెన్స్ ఎవరు రాణించడం లేదు. అటు బౌలర్స్ కూడా అత్యంత ఫెళవమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఫామ్ లో లేని ముంబై, డిల్లీ వంటి జట్లు కూడా ఆర్సీబీ బౌలర్స్ కారణంగా ఆ జట్లు విజయాల బాట పడుతున్నాయంటే ఆ జట్టు బౌలింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు, ఈ సీజన్ లో ఎలాగైనా ఐపీఎల్ కప్పు సాధించాలని భావించిన ఆర్సీబీకి మరోసారి నిరాశ తప్పెలా లేదు.

ఆర్సీబీకి కోహ్లీ గుడ్ బై ?

వచ్చే ఐపీఎల్ సీజన్ లో కోహ్లీ ఆర్సీబీని వీడనున్నాడా అంటే అవుననే గుసగుసలు అడపా దడపా వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆర్సీబీకి ఆడుతూ వస్తున్న కోహ్లీ.. జట్టుకు కప్పు అందించే దిశగా ప్రతి సీజన్ లో అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నప్పటికి లక్ కలిసి రావడం లేదు. దాంతో వచ్చే సీజన్ లో కోహ్లీ మెగా వేలానికి వచ్చే అవకాశం ఉందంటే టాక్ జోరందుకుంది. మరి నిజంగానే కోహ్లీ ఆర్సీబీకి గుడ్ బై చెబుతాడా ? లేదా అనేది చూడాలి.

Also Read:ఉదయాన్నే తలనొప్పి వస్తే..ఇలా చేయండి!

- Advertisement -