బిఎస్పీతో దోస్తీ..బి‌ఆర్‌ఎస్ కు కలిసొస్తుందా? 

36
- Advertisement -

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ముందు బి‌ఆర్‌ఎస్ మరియు బిఎస్పీ పార్టీల మద్య పొత్తు కుదిరింది. గత కొన్నాళ్లుగా ఈ రెండు పార్టీల మద్య పొత్తు అంశం తరచూ చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇరు పార్టీలు కూడా అధికారికంగా పొత్తును కన్ఫర్మ్ చేశాయి. 17 లోక్ సభ స్థానాలకు గాను 15 స్థానాల్లో బి‌ఆర్‌ఎస్, 2 స్థానాల్లో బిఎస్పీ పోటీ చేయబోతున్నట్లు ఇరు ప్రకటించాయి. ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ పార్టీ 9 స్థానాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన ఆరు స్థానాలకు కూడా త్వరలేనే అభ్యర్థుల ఎంపిక జరగనుంది. పొత్తులో భాగంగా బిఎస్పీ హైదరబాద్, నాగర్ కర్నూల్ లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బి‌ఆర్‌ఎస్ మరియు బిఎస్పీ మద్య పొత్తు కుదరడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి..

అటు కాంగ్రెస్ కూడా వామపక్షాలతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలు క్లారిటీ ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పొత్తు లేకుండా బరిలో దిగిన బి‌ఆర్‌ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో పొత్తుకు సై అనడం వెనుక వ్యూహం ఏంటనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. లోక్ సభ ఎన్నికల్లో 10-15 స్థానాల్లో గెలిచే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు అధినేత కే‌సి‌ఆర్. అందుకే అభ్యర్థుల ఎంపికలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బిఎస్పీతో పొత్తు పెట్టుకోవడం వల్ల దళిత ఓటు బ్యాంకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటవచ్చనే వ్యూహంగా కనిపిస్తోందనేది కొందరి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనప్పటికి బి‌ఆర్‌ఎస్ మరియు బిఎస్పీ మద్య పొత్తు కుదరడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మరి ఈ పొత్తు ప్రభావంతో లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

https://x.com/BRSparty/status/1768515577008812177?s=20

Also Read:Chiru:కుర్ర దర్శకుల వెంటే మెగాస్టార్?

- Advertisement -