కాంగ్రెస్‌ను కూల్చేందుకు కుట్ర..?

55
- Advertisement -

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందా ? ఈ కుట్రను రాహుల్ గాంధీ ముందే ఊహించారా ? అసలు ఎవరి కేంద్రంగా కుట్ర జరుగుతోంది ? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం కర్నాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మే లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నా సంగతి తెలిసిందే. 224 సీట్లకు గాను ఒక్క కాంగ్రెస్ పార్టీనే 155 సీట్లు కైవసం చేసుకొని చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని స్థాపించింది. అయితే ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు గడకముందే.. ప్రభుత్వం కూలుతుందేమో అనే భయం పార్టీని వెంటాడుతోందట. .

ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సి‌ఎం డీకే శివకుమారే అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. ఇటీవల డీకే మాట్లాడుతూ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందని, బీజేపీ నేతలు, ఇతర పార్టీల నాయకులతో ఒప్పందాలు చేసుకోవడం మొదలు పెట్టారని డీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఎన్నికల ముందు రాహుల్ గాంధీ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.

Also Read:కేర్ ఫుల్: పుట్టగొడుగులు తింటున్నారా..!

కాంగ్రెస్ కు భారీ విజయాన్ని కట్టబెట్టిన అధికారం నిలుపుకోవడం కష్టమేనని రాహుల్ గాంధీ ఎన్నికల ముందే బీజేపీ వ్యూహాలను పసిగట్టారు. కాగా ప్రభుత్వాలను కూల్చి అధికారం సాధించడం బీజేపీకి కొత్తేమీ కాదు. అయితే ప్రస్తుతం కర్నాటకలో కాంగ్రెస్ కు స్పష్టమైన బలం ఉంది. 155 మంది ఎమ్మేల్యేలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. అయితే ఇందులే కాంగ్రెస్ ను కూల్చలంటే కనీసం 45 మంది ఎమ్మెల్యేలు పిరాయింపులకు పాల్పడవలసి ఉంటుంది. మరి ఇంతమంది ఎమ్మెల్యేలను బీజేపి వైపు తిప్పుకొని కమలనాథులు అధికారాన్ని చేజిక్కించుకోగలరా అనేది చూడాలి. మొత్తానికి బీజేపీ కుతంత్ర వ్యూహాలతో కాంగ్రెస్ కొంత భయాందోళనకు గురౌతున్నాట్లే తెలుస్తోంది.

Also Read:కెప్టెన్ మిల్లర్‌..టీజర్ డేట్ ఫిక్స్‌

- Advertisement -