కాజల్ అగర్వాల్ మంచి అందెగత్తె. ఆమెకి అందుకే చందమామ అన్న పేరు వచ్చింది. ఐతే, ఆమె ఇప్పుడు సీనియర్ అయిపోయింది. పైగా పెళ్లి అయ్యి తల్లి అయిపోయింది కూడా. దీనికితోడు ఇప్పటికే 17 ఏళ్ల కెరీర్ కూడా పూర్తి చేసుకొంది. ఆమె వయసు కూడా 38 దాటింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న భగవంత్ కేసరి సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, ఆమె ఇప్పుడు ఒక సమస్యతో ఇబ్బంది పడుతోంది. అదే … బరువు. కాజల్ అగర్వాల్ తల్లి అయ్యాక, బాగా బరువు పెరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక, నిత్యం జిమ్ కి కూడా వెళ్తుందట ఈ భామ.
అలాగే ఫిట్ నెస్ కోసం కసరత్తులు చేస్తుంది. అయినా, కాజల్ అగర్వాల్ మాత్రం బొద్దుగానే కనిపిస్తోంది. దీనికి కారణాన్ని బాధ పడుతూ చెప్పింది కాజల్. తాను మూడు, నాలుగు రోజులు జిమ్ కి డుమ్మా కొడితే వెంటనే బరువు పెరుగుతున్నాను అని కాజల్ తెగ ఫీల్ అయిపోతుంది. ఇదే తనకున్న అది పెద్ద సమస్య అని కాజల్ అంటుంది. ప్రస్తుతం విడుదలకు రెడీగా ఉన్న భగవంత్ కేసరి సినిమాలో ఈ భామ అలా బొద్దుగానే కనిపిస్తోంది. ఒక్క రోజు కూడా జిమ్ ఎగ్గొట్టకుండా కష్టపడితేనే ఆమె ఫిట్ గా ఉంటుంది అన్నమాట. ఇప్పటికే 70 చిత్రాలకు పైగా కాజల్ పూర్తి చేసింది.
భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో నటించాలి అనేది కాజల్ ఆశ. అలాగే, అనేక వెబ్ డ్రామాస్ లో కూడా నటించాలని ప్లాన్ చేసుకుంటుంది. అదే విధంగా, బాలీవుడ్ లో కూడా మంచి మంచి రోల్స్ చేయాలని ఆశ పడుతుంది. ఇప్పటికే హీరోయిన్ గా కాజల్ ఎంతో సాధించింది, ఎంతో సంపాదించింది. కానీ, పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాక కూడా, సినిమాల పై తన ఆలోచనను ఇప్పట్లో మానేలా లేదు. సో, కెరీర్ ముఖ్యం అనుకుంటున్న ఈ భామ మరి ఎక్సర్ సైజ్ లు మిస్ కాకుండా చూసుకుంటాను అంటుంది.
Also Read:మనోజ్ మంచు…‘వాట్ ది ఫిష్’